Karthik Dandu: కార్తీక్ దండు విరూపాక్ష సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈయన దర్శకత్వం వహించిన మొదటి సినిమానే ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష సినిమా ఈనెల 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అవ్వడంతో తాజాగా డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా కార్తీక్ దండు మాట్లాడుతూ తాను కరోనా కంటే ముందుగానే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసి సినిమాని మొదలు పెట్టాలని భావించాము అయితే లాక్ డౌన్ రావడంతో ఈ సినిమా పనులు ఆగిపోయాయి. ఇక లాక్ డౌన్ తర్వాత ఈ సినిమాని ప్రారంభించాలని మా టీం తో కలిసి చర్చలు మొదలు పెట్టాము.అయితే కొన్ని సెకండ్ల వ్యవధిలోనే మా ఫోన్లందరివి ఒక్కసారిగా మోగాయి .అదే సమయంలో ఆఫీస్ బాయ్ వచ్చి టీవీ పెట్టగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలిసింది.
Karthik Dandu:
ఇలా సాయి ధరంతేజ్ దాదాపు 22 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారు. అయితే ఆ 22 రోజులు నేను హైదరాబాదులో తిరుగుతున్నా కోమాలోనే ఉన్నాను ఏం చేయాలో తోచడం లేదు ఎప్పుడైతే సాయిధరమ్ తేజ్ కోలుకున్నారని తెలిసిందో అప్పుడే తనకు ప్రాణం తిరిగి వచ్చిందని అప్పుడే తాను ఊపిరి తీసుకున్నానని కార్తీక్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. హీరో కోలుకున్న తర్వాత సెట్ లోకి అడుగు పెట్టారు. అయితే అప్పుడు సాయి ధరంతేజ్ చాలా ఇబ్బంది పడ్డారని అనంతరం స్పీచ్ తెరపి డాన్స్ ప్రాక్టీస్ చేసి ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారని తెలిపారు.