Karthika Deepam Deepa: వంటలక్క ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరి మదిలో కార్తీకదీపం సీరియల్ గుర్తుకు వస్తుంది. ఈమె మలయాళ నటి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలా విపరీతమైన తెలుగు అభిమానులను సొంతం చేసుకుంది. ఈమె కేవలం కార్తీకదీపం సీరియల్ లో మాత్రమే నటించారు. ఈ సీరియల్లో దీప పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈమె అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. దీప పాత్రలో ఒదిగిపోయి విశేషమైన ప్రేక్షకాదరణ పొందిన దీప దీప పేరు కన్నా వంటలక్కగా ప్రతి ఒక్క అభిమానిని సందడి చేశారు.ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
ఇక బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కేవలం వంటలక్క కోసమే చూసేవారు ఉన్నారు అంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ఈమె ఈ సీరియల్ నుంచి పూర్తిగా దూరమయ్యారు.ఈ విధంగా దీప సీరియల్ నుంచి దూరం కావడంతో ఎంతోమంది దీపలేని సీరియల్ మేము చూడము అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరిగి ఈమెను ఈ సీరియల్ లోకి ఎలాగైనా తీసుకురావాలని కొందరు అభిమానులు పట్టుబడ్డారు.ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో క్రేజీ సంపాదించుకున్న దీప ఒక నేరం చేసింది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వైరల్ అవుతుంది.

Karthika Deepam Deepa: అభిమానుల ప్రేమకు ఫిదా అవుతున్న వంటలక్క…
ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా అందరి మనసులు దోచుకొని ప్రస్తుతం ఈ సీరియల్ నుంచి దూరమై పెద్ద నేరం చేశారని, ఎలాగైనా ఈమెను పట్టుకుంటే పది లక్షల నజారాన ఉంటుంది… వాంటెడ్ వంటలక్క అంటూ ఒక పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ పోస్టర్ ను ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ఫిదా అవుతూ.. థాంక్యూ సో మచ్ అంటూ ఈ పోస్టర్ ని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈమె బుల్లితెర సీరియల్ కి దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనుకు సంబంధించిన క్యూట్ అండ్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఎలాగైనా వంటలక్క తిరిగి కార్తీకదీపం సీరియల్ లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె తిరిగి ఈ సీరియల్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది.