Karthika Deepam November 1 Episode: బుల్లితెర ప్రేక్షకులకు అసలు పరిచయమే అక్కర్లేని జంట డాక్టర్ బాబు, వంటలక్క. మరి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సీరియల్ కార్తీకదీపం. మన తెలుగింటి ఆడపడుచుల ఫేవరెట్ మరియు మోస్ట్ వాంటెడ్ సీరియల్గా హయ్యస్ట్ టిఆర్పి రేటింగ్ తో ముందుకు దూసుకెళుతోంది. ఇక ఈ రోజు అంటే నవంబర్ 1 వ రోజున జరిగిన సన్నివేశాల్ని చూద్దాం రండి!
ఇక ఈరోజటి ఎపిసోడ్ లో…..
ఏమై ఉంటుంది సౌందర్య? దీప ఎటు వెళ్లి ఉంటుంది అని అంటాడు ఆనంద్ రావు. ఏమోనండి రాత్రి పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడలేదట అంటుంది సౌందర్య. అప్పుడే ప్రియమణి వచ్చి అమ్మా నాకు మోనితమ్మ ఫోన్ చేసిందమ్మ జరిగిందంతా చెప్పింది డాక్టర్ అయ్యా సంతకం చేసాడంట కదా.. మౌనితమ్మ కి మగబిడ్డ పుట్టాడంట కదా అని అంటుంది. ఏంటి ఆ మౌనిత నీకు ఫోన్ చేసిందా? ఈ విషయం కొంపదీసి దీపతో చెప్పావా ఏంటి? అని అడుగుతుంది సౌందర్య. లేదమ్మా అని అబద్ధం చెప్తుంది ప్రియమణి. అమ్మ అదీ…. బాబు పేగు మెడకు వేసుకొని పుట్టాడంట కదా అలా అయితే మేనమామ కి లేదా నాన్నకి గండం అంటారు కదా… మేనమామ ఎలాగో లేడు మరి డాక్టర్ అయ్యకి గండమే కదా శాంతి ఏదో జరిపిస్తారు కదమ్మ అని అంటూ వెళ్ళిపోతుంది ప్రియమణి.

మౌనిత ప్రియమణి కి ఫోన్ చేసి ఏమైంది ప్రియమణి చెప్పింది చెప్పినట్లు చేసావా? అని అడుగుతుంది. హా చేశానమ్మ కానీ సౌందర్యమ్మ కంగారు పడుతున్నారు అని చెప్తుంది. కంగారు పడాలి వాళ్లని ఇక్కడి నుంచే పరిగెతిస్తాను అంటుంది మౌనిత. ఏంటోనమ్మా నాకు ఇక్కడ భయమేస్తుంది అని అంటుంటే ప్రియమణి నీలాంటి పని మనిషి దొరకడం చాలా కష్టం… నన్ను ఒకసారి వచ్చి కలువు అని చెప్తుంది.

దీపా హాస్పిటల్ కి వెళ్లి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి వచ్చి మా ల్యాబ్ ఓనర్ గారి దగ్గరికి రండి అని తీసుకెళ్తుంది. మేడం మీరు డాక్టర్ కార్తీక్ గారి భార్య కదా? కార్తీక్ గారు టెస్ట్ లకి అని శాంపిల్స్ ఇచ్చి వెళ్లారు. కానీ ఆ తర్వాత మేము ఫోన్ చేసినా ఎన్ని మెసేజ్ లు పెట్టినా ఆయన స్పందించలేదు. చివరకు శాంపిల్స్ మా దగ్గరే ఉండి పోయాయి మీరు మా ల్యాబ్ మీద అతి పెద్ద ఆరోపణ చేశారు. ఆ మౌనిత ఎవరో మాకు తెలియదు.ఈ ల్యాబ్ నుండి ఆ శాంపిల్స్ బయటకు వెళ్లవు, వెళ్లదు కూడా మేడం మీరు ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్తాను అంటాడు డాక్టర్. డాక్టర్ చెప్పిన సమాధానానికి షాక్ అవుతుంది దీప ఇక ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది.
కార్తీక్, దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సౌర్య వచ్చి ఏంటి నాన్న బాధపడుతున్నారా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పవా అంటూ మేము ఇప్పుడు నీతో బాగానే ఉంటున్నాం కదా మరి అమ్మ, నువ్వు ఎందుకు అంత బాధ పడుతున్నారు అని అడుగుతుంది. అదేం లేదమ్మా అంటాడు కార్తీక్. నాన్న ఏంటి నువ్వు నన్ను అమ్మ అంటున్నావా అలా అంటే నాకు ఇష్టం ఉండదు రౌడీ అంటేనే ఇష్టం అని చెప్తూ మాట్లాడుతుంది సౌర్య.
సీన్ కట్ చేస్తే…..
వారణాసి ల్యాబ్లో దీప గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి ఏంటి సార్ టెస్ట్ లకి వచ్చారా? అని అడుగుతుంది. లేదు మా దీపక్క వచ్చింది తన కోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్తాడు. ఆవిడ ఇప్పుడే వెళ్లి పోయారు అని చెప్పగానే అవునా నేను బయటే ఉన్నాను కదా వెళ్ళిపోయిందా అంటూ వెళతాడు వారణాసి.

ఇక మౌనిత కొడుక్కి బారసాల చేసే ప్రయత్నంలో ఉంటుంది. భారతి నువ్వు నీ కూతురికి బారసాల ఎలా చేసావు? అని అడుగుతుంది. ఏంటి నువ్వు వీడికి బారసాల చేస్తావా? అంటుంది భారతి. హా జామ్ జామ్ అంటూ చేస్తా వీడు లీగల్ పీస్ ఇద్దరి డాక్టర్ల కొడుకు అంటుంది మౌనిత. దీపని చూశావా ఒక్క మాట మాట్లాడకుండా 11 ఏళ్ల తర్వాత గెలిచింది నువ్వు కూడా అవకాశం కోసం ఎదురు చూడు అంటుంది భారతి. నువ్వు దీప మీద జాలి పడకు, రేపు మా అత్తయ్య వెళ్లి గుడిలో హోమం చూపిస్తుంది అది నాకు మొదటి విజయం అవుతుంది అని చెప్తుంది మౌనిత. ఇక ఇది ఇవాల్టి ఎపిసోడ్.
రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో రేపు మళ్ళీ ఇదే సమయానికి, ఇక్కడే తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్!