Karthika Deepam Priyamani: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న దారావాహిక కార్తీక దీపం. స్టార్ మాలో ప్రసారం అయ్యే ఈ సీరియల్ కి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. రాత్రి 7.30ని లు అయ్యిందంటే చాలు ఎన్ని పనులు ఉన్నాకూడా వాటిని పక్కన పెట్టి మరి ఈ సీరియల్ ని చూస్తుంటారు. ఈ సీరియల్ రేటింగ్‌కి టాప్ హీరోల సినిమాలు, షోలు కూడా బ్రేక్ చేయలేకపోతున్నాయి. సెలబ్రిటీల ఇళ్లలో సైతం ఈ సీరియల్‌కి మంచి క్రేజ్ ఉంది. ఈ సీరియల్ మొదటగా మలయాళం లో ప్రసరమై కన్నడ ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ హిట్ సీరియల్ గా పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత తెలుగులో కూడా ప్రసారం అవుతూ టిఆర్ పి రేటింగ్స్ ఏ మాత్రం తగ్గకుండా నడుస్తుంది. అన్ని సీరియల్స్ కంటే కూడా కార్తీకదీపం మొదటి స్థానంలో కొనసాగుతుంది. కార్తీకదీపం సీరియల్ ఇప్పుడు పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. కార్తీకదీపం సీరియల్ లో వంటల డాక్టర్ బాబులను చంపేసి వారి కూతుర్లు అంటూ కొత్త జనరేషన్ అంటూ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే కొత్త జనరేషన్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఈ సీరియల్ ను చూడటం చాలా వరకు తగ్గించేశారు.
Karthika Deepam Priyamani: హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న ప్రియమణి..
చాలామంది ఈ సీరియల్లో డాక్టర్ బాబు, వంటలక్క ఉన్నప్పుడే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సీరియల్ లో డాక్టర్ బాబు వంటలక్క ఎంత ఫేమస్సో మోనిత కూడా అంతే ఫేమస్. ఇక మోనితతో పాటుగా ఆమె పనిమనిషి ప్రియమణి కూడా బాగా క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఆమె సీరియల్ లో పనిమనిషి అన్న మాటే కానీ మోనిత కంటే బాగా రెడీ అవుతూ ఉంటుంది. దీనితో ఆమెను అందాల పనిమనిషి ప్రియమణి అని పిలుస్తూ ఉంటారు. అయితే నెక్స్ట్ జనరేషన్ పేరుతో ఈ సీరియల్ మొత్తం మారిపోవడంతో మోనితతో పాటుగా ప్రియమణి కూడా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే ప్రియమణి కార్తీకదీపం సీరియల్ లో కనిపించకపోయిన సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తోంది ఈ అందాల పనిమనిషి.