Kasturi Shankar ఒకప్పుడు తెలుగులో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అన్నమయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ ప్రముఖ హీరో కింగ్ నాగార్జున హీరోగా నటించగా తెలుగు వెటరన్ హీరోయిన్లు రమ్య కృష్ణ మరియు కస్తూరి శంకర్ తదితరులు నటించారు. అయితే ఇందులో నటి రమ్యకృష్ణ ఇప్పటికీ తన స్టార్డమ్ ను కొనసాగిస్తూ వరుస సినిమాల్లో నటిస్తూ బాగా ఆకట్టుకుంటుంది. కానీ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన కస్తూరి శంకర్ మాత్రం స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో తక్కువ సమయంలోనే ఫేడ్ అవుట్ అయిపోయింది.
అయితే ఈ మధ్య కాలంలో నటి కస్తూరి శంకర్ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి అమ్మ, అక్క, చెల్లి, వదిన తదితర పాత్రలలో నటించడానికి ఓకే చెబుతోంది. కాగా ప్రస్తుతం నటి కస్తూరి శంకర్ తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి అనే ధారావాహికలో తులసి పాత్రలో నటిస్తోంది. దీంతో ఈ పాత్ర కోసం రోజుకి నటి కస్తూరి శంకర్ దాదాపుగా లక్ష రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
అయితే ఇటీవల కాలంలో నటి కస్తూరి శంకర్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటోంది. దీంతో తాజాగా నటి కస్తూరి శంకర్ గౌను దుస్తులు ధరించి కొంతమేర బోల్డ్ గా, క్లీవేజ్ షో చేస్తూ దిగినటువంటి ఫోటో లను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఇప్పుడు సినిమాలపై మరియు అందాల ఆరబోత పై పెట్టినటువంటి దృష్టి మరియు కృషి కొన్నేళ్ళ క్రితం ముందు పెట్టి ఉంటే ఈపాటికి మంచి స్టార్ సెలబ్రిటీ హోదా లో ఉండే దానివని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అలాగే సీరియల్స్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించే వాళ్లకి ఇలాంటి బోల్డ్ ఫోటో షూట్లు వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరని కాబట్టి అందాల ఆరబోత తగ్గిస్తే మంచిదని సూచిస్తున్నారు.