Kasturi Shankar: వెండితెరపై పలు సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కస్తూరి శంకర్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు. అలాగే బుల్లితెర సీరియల్స్ లో కూడా ఈమె నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో తులసి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే కస్తూరి శంకర్ ఏ విషయం గురించి అయినా సూటిగా మాట్లాడుతూ తన అభిప్రాయాలను చెప్పడంతో కొన్నిసార్లు వివాదాలలో కూడా చిక్కుకుంటూ ఉంటారు.
ఇలా ఈ విషయాలన్నీ పక్కన పెడితే తాజాగా ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి కస్తూరి శంకర్ తో పాటు బ్రహ్మముడి కనకం కూడా హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఓం కార్ కస్తూరి శంకర్ గురించి మాట్లాడుతూ తన పట్ల బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా కస్తూరి శంకర్ వేదిక పైకి వచ్చి రాగానే బాసు వేర్ ఇస్ ద పార్టీ అనే పాటకు అద్భుతమైన డాన్స్ చేశారు.

Kasturi Shankar: మరదలు గానే ఉన్నారు..
ఈ పర్ఫామెన్స్ అయిన అనంతరం ఓంకార్ కస్తూరి శంకర్ తో మాట్లాడుతూ… కస్తూరి గారు కాస్త లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోండి… రైట్ టర్న్ ఇవ్వండి అంటూ చెబుతూ ఏ యాంగిల్ లో చూసిన మీరు మదర్ గా అసలు లేరు మరదలుగానే ఉన్నారు అంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇలా ఓంకార్ తనని మరదలు అని అనడంతో కస్తూరి ఒక్కసారిగా తెగ సిగ్గు పడిపోయింది. ఇక బ్రహ్మ ముడి కనకం సైతం ఊ అంటావా మామ అనే పాటకు అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు. అయితే వీరి పర్ఫామెన్స్ చూసిన ఓంకార్ మదర్స్ అని పిలిస్తే ఇక్కడ ఎవరు మదర్స్ లా లేరు నాకు చెమటలు పట్టేస్తున్నాయి అంటూ కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.