Katrina Kaif: ప్రముఖ సినీ నటి కత్రినా కైఫ్ అంటే తెలియని వారుండరు అసలు. ఈమెకు ఉన్న క్రేజ్ ను బట్టి చెప్పవచ్చు. ఈమె ఎంతటి గొప్ప నటి అన్నది. అదే విధంగా బాలీవుడ్ లో అత్యధికంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ లలో ఈమె మొదటి స్థానం లో ఉందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు.

ఎందుకంటే ఈమె అందచందాలతో తన డాన్స్ లతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అయితే కత్రినా కైఫ్ నిరంతరం ఏదో ఒక సినిమాతో బిజీగా ఉంటుంది. కత్రినాకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఎంత వయసు వచ్చిన ఆమె అందం తగ్గకపోవడం తో ఆమె సైన్నాల్లో అవకాశాలు కూడా తగ్గడం లేదు.

కాబట్టి బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న భామగా బిజీగా ఉంటుంది. ఇక ఇటీవల ఆమె నటుడు విక్కీ కౌశల్‌ని పెళ్లాడి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని బార్వారాలో రాజ వైభవంగా వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఈ సందర్భంగా.. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి తర్వాత కూడా కత్రినా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు తన వైవాహిక జీవితం కారణంగా.. కొన్నిసార్లు ఆమె ఫ్యాషన్ కారణంగా అలాగే కొన్నిసార్లు ఆమె చిత్రాల కారణంగా, నటి నిరంతరం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘ఫోన్ భూత్’ ప్రమోషన్ లో బిజీగా ఉన్న కత్రినా మరో విషయంపై దృష్టి పెట్టింది. అయితే ఈమె పేరు కత్రినా కైఫ్. చాలామంది కత్రినాను ఈ పేరుతో పిలుస్తుంటారు. అయితే ఈమెను క్యాట్ అనే ముద్దుపేరుతో పిలిచేవారు కూడా ఉన్నారు. అయితే ఆ నటికి ఈ పేరు ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు.

Katrina Kaif: కత్రినా కు క్యాట్ అనే మారు పేరు..

అయితే ఈ విషయాన్ని కత్రినా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే.. కత్రినా బాాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌తో ఇంటర్వ్యూకు హాజరైంది. ఆ సమయంలో.. ఆమెకు పిల్లి అనే పేరు మొదట ఎవరు పెట్టారు అని అడిగారు. దీనిపై కత్రినా స్పందిస్తూ.. తనకు ముందుగా క్యాట్ అనే పేరు పెట్టింది ప్రముఖ కొరియోగ్రాఫర్ అహ్మద్ ఖాన్ అని ఆమె చెప్పింది. అయితే అతను ప్రత్యేకంగా ఆమెను ఆ పేరు ఎందుకు పెట్టాడో తెలీదు కానీ మొత్తానికి ముద్దుగా ఉన్న పేరు పెట్టాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on అక్టోబర్ 24, 2022 at 5:00 సా.