Katrina Kaif: హా.. కత్రినాకైఫ్ మూడు నెలల గర్భవతా.. బాలీవుడ్ లో ట్రెండీ టాక్!

Akashavani

Katrina Kaif: సినీ లవర్స్ కి బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో మల్లీశ్వరి సినిమాలో స్టార్ హీరో వెంకటేష్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులతో ఊహించని విధంగా ర్యాపో పెంచుకుంది. కానీ ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

క్రమంగా బాలీవుడ్లోనే స్థిరపడిపోయింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. చేతి నిండా సినిమాలతో కెరీర్ పరంగా మూడు పూలు ఆరు కాయలు లాగా ఈ అమ్మడు వెలుగుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను నెట్టింట్లో ఆరబోస్తుంది.

ఇక ఈ అందాల భామ యంగ్ హీరో విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కొంతకాలం వీరిద్దరు హిడెన్ ప్రేమాయణం నడిపి ఇటీవల ఈ జంట ఒకటయ్యారు. ఈ జంట డిసెంబర్ 9న రాజస్థాన్లో పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరైన ఈ పెళ్లిని ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఇదిలా ఉంటే కత్రినాకైఫ్ మూడు నెలల గర్భవతి అని నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Katrina Kaif: హా.. కత్రినాకైఫ్ మూడు నెలల గర్భవతా.. బాలీవుడ్ లో ట్రెండీ టాక్!
Katrina Kaif: హా.. కత్రినాకైఫ్ మూడు నెలల గర్భవతా.. బాలీవుడ్ లో ట్రెండీ టాక్!

Katrina Kaif: గర్భవతి అన్న వార్తను వాళ్ళు ఈ విధంగా కొట్టిపారేశారు!

ఇక గత కొన్ని రోజులుగా ఈ అమ్మడు గర్భవతి అని త్వరలోనే ఈ జంట బిడ్డ ను ఆశిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ పుకార్లను విక్కీ ప్రతినిధులు ఒట్టి మాటలు అని కొట్టిపారేశారు. అలాంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. మరోవైపు కత్రినా టీం కూడా ఈ వార్తలపై ఖండించారు. అంతేకాకుండా ప్రస్తుతం కత్రినా తన దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తుందని తెలిపారు.

ఏదేమైనా గత కొన్ని రోజులుగా కత్రినాకైఫ్ మూడు నెలల గర్భవతి అని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ పుకార్ల గురించి కత్రినా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -