Katrina-Vicky సాధారణంగా పెళ్లయ్యాక కొత్త జంట ఏదైనా హనీమూన్ ప్లాన్ వేసుకుంటారు. కానీ ఈ ఇద్దరు మాత్రం వెడ్డింగ్ అయిపోయిందో..? లేదో తమ పనులతో బిజీ అయిపోయారు. అంటే ఇద్దరూ షూటింగ్స్ లో చేరిపోయారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలెవరో గెస్ చేశారా.? బీటౌన్ కపుల్ విక్కీకౌశల్-కత్రినాకైఫ్. ఈ ఇద్దరికీ చాలా కాలం తర్వాత ఫ్రీ టైం దొరికినట్టుంది. ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే ఈ బాలీవుడ్ యాక్టర్లు రీసెంట్‌గా వెకేషన్ టూర్ వేసుకున్నారు. పెళ్లయి మూడు నెలలు దాటిపోయింది. విక్కీ కౌశల్,కత్రినాకైఫ్ బీచ్ వెకేషన్ గోల్స్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తూ..తమ ఫాలోవర్లు, అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. బ్లాక్ షార్ట్స్ విత్ బ్లాక్ గాగుల్స్ లో స్టైలిష్ లుక్‌లో ఉన్న విక్కీ సాగరంలో బోటుపై షికారు చేశాడు. వర్కవుట్ సెషన్ తర్వాత షర్ట్ లేకుండా వెకేషన్ ట్రిప్‌లో స్టన్నింగ్ లుక్ లో దిగిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మరోవైపు కత్రినా వైట్ స్లీవ్ లెస్ టాప్ లో స్టైలిష్‌క్యాప్, గాగుల్స్ పెట్టుకుని బోటు సీటులో కూర్చొని కెమెరాకు ఫోజులిచ్చింది.
ఇద్దరూ కలిసి షిప్‌లో రొమాంటిక్ రైడ్ చేస్తూ..సన్ షైన్ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ ఫొటోలు, సెల్పీలు తీసుకున్నారు. కత్రినా బ్లూ అండ్ యెల్లో స్విమ్ షూట్ ఇన్ ప్లేటెడ్ బోటులో భర్తతో కలిసి సరదా రైడ్ చేసింది. పచ్చని చెట్లతో నిండిపోయిన కొండలు, మధ్యలో సముద్రం..ఈ క్రేజీ కాంబినేషన్ మధ్య కత్రినా-విక్కీ కపుల్ రొమాంటిక్ వెకేషన్ కు సంబంధించిన ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
విక్కీ కౌశల్ ప్రస్తుతం సారా అలీఖాన్‌తో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు మేఘనా గుల్జార్ డైరెక్షన్‌లో సామ్ బహదూర్ లో టైటిల్ రెల్ పోషిస్తున్నాడు. దీంతోపాటు గోవిందా నామ్ మేరా సినిమా కూడా లైన్ లో ఉంది. మరోవైపు కత్రినాకైఫ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో టైగర్ 3, విజయ్ సేతుపతితో మేరీ క్రిస్మస్ సినిమాలు చేస్తుంది.