Keeravani: ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు తెచ్చిన ఘనత రాజమౌళికి దక్కింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఇటీవల ఆస్కార్ అవార్డు వరించిన సంగతి అందరికీ తెలిసిందే. నాటు నాటు గేయ రచయిత చంద్రబోస్, ఆ పాటకు సంగీతం అందించిన కీరవాణి ఈ అవార్డు అందుకున్నారు.
ఇంటర్నేషనల్ వేదిక మీద తెలుగు పాట పాడి అందరి చేత చప్పట్లు కొట్టించారు సింగర్ భైరవ, రాహుల్ సిప్లిగంజ్. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు రావటంతో తెలుగు ప్రజలే కాకుండా దేశం మొత్తం ఆనందం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా నాటు నాటు పాట గురించి కీరవాణి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా కీరవాణిని ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యు ని‘ఆస్కార్ వెనక నాటు నిజం’ పేరుతో ఓ వీడియోని పోస్ట్ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో నాటు నాటుకు ఆస్కార్ దక్కడం గురించి ‘ఈ పాటని వేరే ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసి, ఆస్కార్ వచ్చుంటే.. దానికి అర్హత ఉందని మీరు భావించేవారా’ అని వర్మ అడగ్గా.. ‘ఈ పాటకు ఆస్కార్ రావడానికి చాలా కారణాలున్నాయి. అవన్నీ తర్వాత చెప్తాను. జస్ట్ ఓ పాటగా తీసుకుంటే మాత్రం ఆస్కార్ వచ్చినందుకు నేను ఫీల్ కాను అని కీరవాణి తెలిపాడు.
Keeravani: నాకే నచ్చలేదు…
జయహో సాంగ్ కు వచ్చినప్పుడు కూడా నేను ఫీల్ అవలేదు అని కీరవాణి బదులిచ్చారు. ఆ తర్వాత “నాటు నాటు సాంగ్ మీ కెరీర్ లో టాప్-100లో ఉంటుందని అనుకుంటున్నారా అని ఆర్జీవీ అడగ్గా.. ‘లేదు’ అని కీరవాణి బదులిస్తూ… ‘ఏదైనా ఒకటి క్రియేట్ చేసినప్పుడు, అవతలి వాళ్లకు నచ్చాలి అని పనిచేస్తున్నప్పుడు అది ముందు మనకు నచ్చాలి. నాకే నచ్చకపోతే ప్రపంచానికి నచ్చుతుందని నేను ఎలా అనుకుంటాను.’ అని అన్నారు. దీంతో తాను కంపోజ్ చేసిన పాటలలో నాటు నాటు పాట కంటే మంచి పాటలు ఉన్నాయని అర్థం వచ్చేలా కీరవాణి బదులిచ్చాడు.