Keerthi Suresh: వెండి తెరపై నటిగా పలు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి వారిలో నటి కీర్తి సురేష్ ఒకరు. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న కీర్తి సురేష్ తాజాగా నాని హీరోగా నటించిన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మార్చి 30వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి కీర్తి సురేష్ తాను నటించిన మహానటి సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. మహానటి సినిమాని సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకున్నారు.అయితే తాజాగా ఈ సినిమా గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సావిత్రమ్మ జీవిత చరిత్రలో నటించాలంటే తనకు ఒక్కసారిగా భయం వేసిందని తెలిపారు.
Keerthi Suresh: డైరెక్టర్ ఎంతో ప్రోత్సహించారు…
సావిత్రమ్మకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే నేను తన జీవిత చరిత్రలో నటించి తన అభిమానులను మెప్పించగలనా అనే సందేహం తనలో కలిగిందని తెలిపారు. ఈ భయం కారణంగా తాను మొదట్లో ఈ సినిమాకు నో చెప్పానని కీర్తి సురేష్ తెలిపారు. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం తనకు ఎంతో ధైర్యం చెప్పారని, ఈ సినిమాలో మీరు మాత్రమే నటించగలరని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.ఇలా తనపై ఆయనకు ఎంతో నమ్మకం ఉండడంతో తనపై తాను నమ్మకాన్ని ఏర్పరచుకున్నానని కీర్తి సురేష్ వెల్లడించారు. ఇలా మహానటి సినిమాకు నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు తన గురించి చాలామంది ట్రోల్ చేశారని ఈ సందర్భంగా కీర్తి సురేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.