Keerthi Suresh: నేను శైలజ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కీర్తి సురేష్.సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి కీర్తి సురేష్ ఇండస్ట్రీలో గ్లామర్ షోకు పెద్దగా తావివ్వకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈమె నటించిన సినిమాలకు కూడా ఎంతో మంచి ఆదరణ రావడంతో ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ అందుకున్నటువంటి ఈమె తాజాగా నాని హీరోగా నటించిన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా మార్చి 30వ తేదీ ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.ఇక కీర్తి సురేష్ గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తుంది. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 40 కోట్ల వరకు ఆస్తులను కూడబెట్టినట్టు సమాచారం. కెరియర్ మొదట్లో ఒక్కో సినిమాకు 70 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకు ఉన్నటువంటి కీర్తి సురేష్ ఇప్పుడు ఒక్కో సినిమాకు మూడు కోట్లు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నారు.
Keerthi Suresh: ఖరీదైన కార్లు.. బంగ్లాలు..
ఈ క్రమంలోనే నానితో నటించిన దసరా సినిమాకు గాను ఈమె మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంది సమాచారం. ఇలా ఈమె ఆస్తులలో భాగంగా చెన్నైలో ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. అలాగే హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో పోస్ట్ ఏరియాలో కూడా ఒక ఇల్లు ఉంది. ఈమె వద్ద ఉన్న కార్లలో బీఎండబ్ల్యూ ఎక్స్ 7 సీరిస్, అలాగే మెన్స్ డేస్, బెంజ్, టయోటా, ఇన్నోవా, క్రిస్టా లాంటి కార్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 3 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇలా కీర్తి సినిమాలలో నటిస్తూ భారీగా సంపాదించింది తెలుస్తుంది.