Keerthi Suresh: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మహానటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.ఈ విధంగా కీర్తి సురేష్ ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు కమర్షియల్ చిత్రాలలో నటించి పలు సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు.ఈమె కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఆగ్ర హీరోలకు చెల్లెలుగా కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజా కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాటతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
ఇలా మహేష్ బాబు సరసన నటించిన మంచి విజయాన్ని అందుకున్న కీర్తి సురేష్ సెల్వ రాఘవన్ తో కలిసి నటించిన సాని కాగితం అనే సినిమాలో డి గ్లామర్ రోల్ చేశారు.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలన్నింటికీ కీర్తి సురేష్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇకపోతే మహానటి సినిమాలో కీర్తి సురేష్ ఎంతో బొద్దుగా ఉండేది. ప్రస్తుతం ఈమె తన శరీర బరువు పూర్తిగా తగ్గిపోయారు. ఇలా సడన్ గా శరీర బరువు తగ్గడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా..మహానటి సినిమా తర్వాత దాదాపు 7 నెలల పాటు ఇంట్లోనే ఉంటూ సరైన వ్యాయామాలు చేస్తూ ఆహార నియమాలు పాటించాలని ఇదే తన సీక్రెట్ అంటూ చెప్పుకోచ్చారు.
Keerthi Suresh: రెమ్యూనరేషన్ పెంచారనే వార్తలు రావడంతో
ఈ మధ్యకాలంలో రెమ్యూనరేషన్ పెంచారనే వార్తలు వస్తున్నాయి. ఈ ప్రశ్నపై మీ సమాధానం అని ప్రశ్నించగా..తాను ఎలాంటి రెమ్యూనరేషన్ పెంచలేదని తెలుగులో ఎంత తీసుకుంటున్నానో తమిళంలో కూడా ఒక్కో సినిమాకు అంతే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నానని తెలిపారు.ఇంకా కొన్నిసార్లు సినిమాని బట్టి తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నానని ఈ సందర్భంగా కీర్తి సురేష్ తన రెమ్యూనరేషన్ లెక్కల గురించి అసలు విషయం బయటపెట్టారు.ఇకపోతే ఈమె ఒక్కో సినిమాకు కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ఈమె నాని సరసన దసరా సినిమాలో నటిస్తున్నారు.