Keerthy Suresh: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళీ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే తెలుగులో మంచి హిట్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత తెలుగులో సార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎందరో స్టార్ హీరోల సరసన నటించిన ఒకరిగా గుర్తింపు పొందింది. కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు దక్కాయి.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా కీర్తి సురేష్ వివాహం గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఆ వార్తల గురించి కీర్తి సురేష్ కొట్టిపారేస్తూ వచ్చింది. అంతే కాకుండా ఆమె పెళ్లి గురించి అధికారికి సమాచారం ఉంటే వెల్లడిస్తామని ఆమె తండ్రి కూడా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా తన పెళ్లి గురించి కీర్తి సురేష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఒక తమిళ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన కీర్తి సురేష్ పెళ్లి గురించి స్పందించింది.
Keerthy Suresh: నేనే చెప్తాను…
ఈ క్రమంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ..” ఇప్పటివరకు నా పెళ్లి గురించి అనేక వార్తలు వినిపించాయి. వాటి గురించి స్పందించకుండా ఉండటం సబబు కాదు. అందుకే వాటన్నింటికీ క్లారిటీ వచ్చేలా నేను త్వరలోనే నా పెళ్లి గురించి అధికారిక ప్రకటన వెల్లడిస్తాను. నిజానికి నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలామంది ఎదురుచూస్తున్నారు” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేకాక ఇకపై తన పెళ్లి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని మీడియాని కోరింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.