Kerthi Suresh: కృతి శెట్టి రిజెక్ట్ చేసిన సినిమాకు కీర్తి సురేష్ సై.. ఆమె పరిస్థితి అంతలా దిగజారిందా?

Akashavani

Kerthi Suresh: టాలీవుడ్ ప్రేక్షకులకు కృతి శెట్టి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఆ ముద్దుగుమ్మ అందం గురించి మనకు తెలుసు. మొదటి సినిమాతోనే ఈ అమ్మడి కుర్రకారుని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది.

ఇక శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాల్లో నటించి ఈ రెండు సినిమాలను సక్సెస్ తీరానికి తీసుకెళ్ళింది ఈ అమ్మడి. దాంతో ఈ ముద్దుగుమ్మ గోల్డెన్ లెగ్ అనే పేరు దక్కించుకుంది. ఇక వరుస ఆఫర్లతో ఈ అమ్మడు తెగ హడావిడి చేస్తోంది. ఏ సినిమా అయినా తనకు నచ్చితేనే చేస్తుంది. ఆమెకు ఏమాత్రం కష్టంగా అనిపించినా ఈ అమ్మడి రిజెక్ట్ చేస్తుంది.

ఇక అదే క్రమంలో కృతి శెట్టి ఒక పాత్రలో చేయలేక ఆ సినిమాను రిజెక్ట్ చేసింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వెంటనే ఈ ఆఫర్ ను కీర్తి సురేష్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకు ఆ సినిమా ఏంటో.. ఆ దర్శకుడు ఎవరో? ఇప్పుడు ఆ వివరాలు మనం తెలుసుకుందాం.

Kerthi Suresh: కృతి శెట్టి దూరం చేసుకున్న సినిమా ఇదే!

ఇంతకు ఆ సినిమా ఏదో కాదు.. చల్ మోహన్ రంగా సినిమా దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న సినిమా. కాగా ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గానే కాకుండా తల్లిగా కూడా కనిపించాలని ఆ సినిమా దర్శకుడు స్టోరీ ద్వారా తెలియజేసాడు.

ఇక కృతి శెట్టి తనకు తల్లి గా కనిపించడం ఇష్టం లేక ఆ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఇక ఈ కథను కీర్తి సురేష్ కి వినిపించగా వెంటనే ఆ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

 

- Advertisement -