Kevvu Karthik: ఇటీవల టాలీవుడ్లో వరుసగా వివాహాలు జరిగాయి. బుల్లితెర వెండితెరకి సంబంధించిన సెలబ్రిటీలు వివాహాలు చేసుకుని కొత్త జీవితాలు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు పొందిన కెవ్వు కార్తిక్ కూడా ఇటీవల వివాహం చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. జూన్ 9వ తేదీన కార్తీక్ వివాహం శ్రీలేఖ అనే యువతీతో ఎంతో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు పలువురు బుల్లితెర నటీనటులు కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం కార్తీక్ – శ్రీలేఖ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొదట మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ని ప్రారంభించిన కెవ్వు కార్తీక్ ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశం దక్కించుకున్నాడు. అలా జబర్దస్త్ లో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకొని కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో “నేను స్టూడెంట్ సర్ “అని సినిమాలో మొదటిసారిగా నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఇలా ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో తో పాటు బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఇతర టీవీ షోలలో పాల్గొంటూ కార్తీక్ సందడి చేస్తున్నాడు. అంతేకాకుండా మరొకవైపు సినిమాలలో కూడా కమెడియన్ గా మంచి మంచి అవకాశాలు అందుకుంటున్నాడు.
Kevvu Karthik: సాంప్రదాయబద్ధంగా కార్తీక్ వివాహం…
అలాగే కార్తీక్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఈ క్రమంలో ఇటీవల తనకి కాబోయే భార్యని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసిన కెవ్వు కార్తీక్ ఇటీవల తన పెళ్లికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నుండి పెళ్లి చివరి వరకు కొన్ని ముఖ్యమైన సంఘటనలు చూపించడం జరిగింది. ప్రస్తుతం కెవ్వు కార్తీక్ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అతని అభిమానులు కార్తీక్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.