Kiara Advani: ఇకనుంచి అలాంటి సినిమాలు చేయను..

G K

Kiara Advani: ఒక్కసారి పాపులారిటీ వచ్చాక ఏ హీరోయిన్ అయిన కొన్ని చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపించరు. బాలీవుడ్ బ్యూటీ క్రేజీ
హీరోయిన్ కియారా అద్వానీ కూడా ఇప్పుడు అలాంటి ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగులో భరత్ అనే నేను సినిమాతో మంచి హిట్
అందుకున్న కియారా, ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాను చేసింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. అప్పటి నుంచి మళ్ళీ తెలుగు
సినిమాలలో నటించని ఈ బ్యూటీ ప్రస్తుతం శంకర్ – రామ్ చరణ్ కలిసి చేస్తున్న పాన్ ఇండియన్ సినిమా ఆర్సీ 15లో హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే, ఇప్పుడు బాలీవుడ్‌లో కియారా అద్వానీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అక్కడ లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్ సినిమా తర్వాత దక్కిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాల తర్వాత హిందీలో వరుసగా భారీ చిత్రాలలో అవకాశాలు అందుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అయితే, తాజాగా ఇచ్చిన ఓ మీడియా ఇంటర్వ్యూలో కియారా రీమేక్ సినిమాలను చేయనంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది. చెప్పాలంటే, కబీర్ సింగ్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి చిత్రానికి రీమేకే.

Kiara Advani: హిట్ అయినా ఫ్లాపయినా ఓటీటీలో వచ్చేస్తున్నాయి.

ఇది భారీ హిట్ అయినా..ఆ తర్వాత అక్షయ్ కుమార్‌తో నటించిన సౌత్ హిట్ సినిమా కాంచన రీమేక్ లక్ష్మీ డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాదు, ఇప్పుడు ఓ భాషలో వచ్చి హిట్ అయినా ఫ్లాపయినా ఓటీటీలో వచ్చేస్తున్నాయి. కాబట్టి దాదాపు అందరూ థియేటర్స్‌లో మిస్ అయినా కూడా ఓటీటీలలో చూసేస్తున్నారు. మళ్ళీ అదే సినిమాను మరో భాషలో తీస్తే చూసే ప్రేక్షకులు తక్కువ. అందుకే, రీమేక్ సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదని కియారా చెప్పుకొచ్చింది. ఒకవేళ మేయిన్ పాయింట్ తీసుకొని పూర్తిగా కథ, కథనాలను మార్చి తీస్తే గనక అలాంటి సినిమాలను చేయడానికి రెడీ అని తెలిపింది.

- Advertisement -