Kiara Advani: ఒకవైపు పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు డేర్‌గా బోల్డ్ పాత్రల్లో నటించడానికి రెడీ అవుతోంది బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ. తెలుగులో అమ్మడు చేసింది రెండు సినిమాలు. వాటిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. కానీ, ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన వినయ విధేయ రామ సినిమా మాత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలింది.
ఆ తర్వాత నుంచి కియారా మళ్ళీ ఇప్పటి వరకు తెలుగులో సినిమాను కమిటవలేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఓ వెలుగు వెలుగుతోంది. అక్కడ మీడియం రేంజ్ సినిమా నుంచి భారీ బడ్జెట్ సినిమా వరకూ కొత్త ప్రాజెక్ట్ మొదలవుతుంటే కియారానే మేకర్స్ సంప్రదిస్తున్నారు. అంతగా అమ్మడికి క్రేజ్ ఉంది. అయితే, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాకు కియారా ఒకే చెప్పడం అప్పట్లో కాస్త హాట్ టాపిక్‌గా మారింది.
Kiara Advani: శంకర్ బ్రాండ్ మీద కియారా ఆర్సీ 15కి సైన్ చేసిందట.
ఈ సినిమా కమిటైన సమయంలో కియారా చేతిలో దాదాపు 8 చిత్రాలున్నాయి. అయినా శంకర్ టీమ్ సంప్రదించగానే ప్రాజెక్ట్ చేసేందుకు ఏమాత్రం ఆలోచించకుండా ఒకే చెప్పింది. ఇలా ఒకే చెప్పడానికి కారణం శంకర్ అని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఆయన సినిమా హాలీవుడ్ రేజ్‌లో హిట్ సాధిస్తుంది. పైగా హీరోయిన్ రోల్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇక ఇది పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటు అన్నీ సౌత్ భాషలలోనూ, హిందీలోనూ భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఇలాంటి ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ఎప్పుడోగానీ రాదు. అందుకే, శంకర్ బ్రాండ్ మీద కియారా ఆర్సీ 15కి సైన్ చేసిందట.