Kiara Advani: భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు సరసన నటించిన ఈ బాలీవుడ్ భామ కియారా అద్వానీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎంఎస్ ధోని సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకున్న ఈ భామ తెలుగులో అడుగుపెడుతూనే బంపర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఇక బాలీవుడ్ లో మాత్రం స్టార్ హోదాకు చేరుకుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.
ఇక అప్పట్లో వరుణ్ ధావన్ తో రిలేషన్షిప్ లో ఉన్నట్టు బాలీవుడ్లో కథనాలు వెలువడ్డాయి కానీ ఆ కథనాల్లో నిజం లేదు అన్నట్లుగా ఈమధ్యనే సిద్ధార్థ మల్హోత్రాన్ని పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. సిద్ధార్థ మల్హోత్రా షేర్ష సినిమాలో కియారా కి కోస్టార్. ఇక వీరి పెళ్లి రాజస్థాన్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. కానీ చాలా ముఖ్యమైన కుటుంబ సభ్యుల మధ్యన మాత్రమే జరిగింది. కానీ రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ జంట.
ఈ మధ్యనే హనీమూన్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఇప్పుడు హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన కియారా తన ఫస్ట్ నైట్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. ఆ రాత్రి గురించి ఏం చెప్పటం సంథింగ్ రియల్లీ స్పెషల్ అంటూ తన భర్తతో దిగిన ఫోటోని షేర్ చేసింది ఈ బాలీవుడ్ భామ. అయితే ఈ స్టేట్మెంట్ కింద కబీర్ సింగ్ డైలాగులతో ఎమోజి లవ్ సింబల్స్ తో నింపేశారు నెటిజన్స్.
Kiara Advani:
మరి కొంతమంది ఫ్యాన్స్ అయితే ఇలా చేసావ్ కియారా అంటూ కబీర్ సింగ్ డైలాగులను ట్యాగ్ చేశారు. ఏదైతేనేమి కొత్తజంట లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలని మరి కొంతమంది నెటిజెన్స్ తమ విషెస్ని తెలియజేస్తున్నారు.