Kiara Advani -Sidharth Malhotra: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో విహరిస్తూ తమ ప్రేమ విషయాన్ని బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే వీరి ప్రేమ గురించి వార్తలు వచ్చిన తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని చెప్పుకొచ్చారు. అయితే చివరికి వీరి ప్రేమ విషయం బయటపడటంతో ఈ జంట తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు పలుకుతూ పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.
ఈ క్రమంలోనే ఈ జంట తమ వివాహ వేడుకలను రాజస్థాన్ లోని సూర్యగఢ్ ప్యాలస్‌లో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. గత మూడు రోజులుగా ఈ ప్యాలెస్ లో హల్ది సంగీత వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు.అయితే పెళ్లికి సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచిన ఈమె పెళ్లి తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Kiara Advani -Sidharth Malhotra: మీ ఆశీర్వాదం కావాలి..
ఇలా తమ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన కియారా మా బంధం పర్మినెంట్గా బుక్ అయింది అంటూ క్యాప్షన్ జోడించారు.అలాగే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తమకు మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ ఈమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కియారా సిద్ధార్థ మల్హోత్రా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఎంతో చూడముచ్చటగా ఉన్నటువంటి ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కావడంతో వీరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
View this post on Instagram