Kili Paul: ఇంటర్నెట్ సెన్సెషన్ కిలి పాల్ పై అటాక్.. కత్తితో పొడిచి..!

Akashavani

Kili Paul: సోషల్ మీడియా ప్రియులకు టాంజానియా కు చెందిన కిలి పాల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయిన ఇతడు ఇండియన్ సాంగ్స్ కి డాన్స్ చేసి వాటిని తన ఇన్ స్టా ఖాతాలో పంచుకునే వాడు. ఆ వీడియోలతో కిలి పాల్ ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టుకున్నాడు.

ప్రతి ఒక్క వీడియోలో కిలి తన హావభావాలను కనబరిచి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఆదరణ పొందాడు. ఆ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటకు రీల్స్ చేస్తూ ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టు కున్నాడు. ఇక కిలి కు టాంజానియా లోని భారత రాయబారి కార్యాలయం లో అతన్ని బాగా సత్కరించారు.

ఇదిలా ఉంటే సోషల్ మీడియా స్టార్ కిలి పాల్ పైన గుర్తుతెలియని కొందరు దుండగులు దాడి చేశారు. ఇంటి దగ్గర ఉన్న అతడి పై ఐదుగురు గుర్తు తెలియని దుండగులు అతడి పై కత్తులతో, కర్రలతో దాడి చేశారని కిలి పాల్ తెలిపాడు. అంతే కాకుండా ఆ సమయంలో తనను తాను రక్షించుకున్నాను అని తెలిపాడు.

Kili Paul: ఇంటర్నెట్ సెన్సెషన్ కిలి పాల్ పై అటాక్.. కత్తితో పొడిచి..!
Kili Paul: ఇంటర్నెట్ సెన్సెషన్ కిలి పాల్ పై అటాక్.. కత్తితో పొడిచి..!

Kili Paul: కిలి కు ఐదు కుట్లు పడడానికి కారణం ఇదే!

ఇద్దరిపై తిరిగి దాడి చేయడంతో.. పక్కనున్న నలుగురు పారిపోయారని తెలిపాడు. అతడిని తాను రక్షించుకునే సమయంలో దుండగులు తన పై కత్తితో దాడి చేయడం వల్ల ఐదు కుట్లు పడ్డాయని తెలిపాడు. ఇక ప్రాణాలతో ప్రస్తుతం బాగానే ఉన్నానని కిలి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా లో ఒక పోస్టు ద్వారా తెలియజేశాడు.

ప్రస్తుతం కిలి పాల్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు తమ డౌట్లను కామెంట్ల రూపం లో అడుగుతున్నారు. ఇక మీరు కూడా ఆ పోస్ట్ పై ఒక లుక్కెయండి.

- Advertisement -