Kiraak RP: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా గుర్తింపు పొందారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో కిరాక్ ఆర్ పి కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన ఆర్పి కొంతకాలం తర్వాత జబర్దస్త్ కి దూరమై మాటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షోలలో సందడి చేశాడు. జబర్దస్త్ నుండి బయటకు వెళ్లిన తర్వాత జబర్దస్త్ యాజమాన్యం గురించి అక్కడ కమెడియన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో ఆర్పి జబర్దస్త్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతేకాకుండా ఆ సమయంలో మరొక జబర్దస్త్ కమేడియన్ అయిన పంచ్ ప్రసాద్ అనారోగ్యంగా ఉన్నా కూడా మల్లెమాల వారు సహాయం చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇక ప్రస్తుతం ఆర్పీ బుల్లితెరకు దూరమై సొంత వ్యాపారం ప్రారంభించాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్ ప్రజలకు చేపల పులుసు రుచి చూపిస్తున్నాడు. ఆర్.పి ప్రారంభించిన రెస్టారెంట్ బిజినెస్ బాగా పాపులర్ అయింది. దీంతో ఎక్కడ చూసినా ఆర్పి చేపల పులుసు గురించే చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్ పి తన కొత్త బిజినెస్ గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అంతేకాకుండా పంచ్ ప్రసాద్ అనారోగ్యం గురించి కూడా మాట్లాడుతూ.. అతని ఆరోగ్యం కుదుటపడే వరకు అతనికి అండగా ఉంటానని వెల్లడించాడు.
Kiraak RP: పంచ్ ప్రసాద్ సర్జరీ కూడా నేనే చేస్తా….
పంచ్ ప్రసాదు ఆరోగ్య పరిస్థితి చాలా దీనంగా ఉంది . ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి చికిత్స తీసుకున్న కూడా అతని ఆరోగ్యం కుదుటపడలేదు. ప్రస్తుతం అతని అనారోగ్యం కారణంగా టీవీ షోలలో పాల్గొనక పోవటంతో ఆదాయం కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో ఆర్పీ తనకు అండగా ఉంటానని తెలియజేశాడు. అతని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు ఆర్థికంగా కూడా అతనికి సహాయం చేస్తానని, అంతేకాకుండా ఎంత డబ్బు ఖర్చైనా కూడా అతనికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయిస్తానని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మణి కొండలో వచ్చే నెల నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నట్లు, ఆ బ్రాంచ్ లో వచ్చిన ఆదాయంతో ప్రసాద్ కి అవసరమైన డబ్బు కంటే పదివేలు ఎక్కువే ఇస్తానని ఆర్పీ వెల్లడించాడు. దీంతో పలువురు నెటిజన్స్ ఆర్పీ మనస్తత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.