Kiraak RP: కిరాక్ ఆర్పీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మారు మోగుతున్న పేరు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన అనంతరం ఈ కార్యక్రమానికి దూరమయ్యారు. ఇలా జబర్దస్త్ దూరంగా ఉన్నటువంటి
కిరాక్ ఆర్పీకొన్ని రోజులపాటు ఇతర షోలలో పాల్గొన్నప్పటికీ అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఏకంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే కర్రి పాయింట్ నిర్వహిస్తూ రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు.ఇలా ఈయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అనే విధంగా అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి అభివృద్ధి చెందిందనీ చెప్పాలి.
ఇలా ఈయన వివిధ రకాల చేపల పులుసులను తయారు చేయడంతో పెద్ద ఎత్తున కస్టమర్లు కూడా రెస్టారెంట్ ముందు బారులు తీరారు. ఇలా కస్టమర్లు తాకిడి తట్టుకోలేక కొంత కాలం పాటు కిరాక్ ఆర్పీ తన రెస్టారెంట్ మూసివేశారు. మరోసారి ఈయన బ్రాంచ్ ఓపెన్ చేసి అందరికీ చేపల పులుసు రుచి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన కర్రీ పాయింట్ గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. తన రెస్టారెంట్ ఇంతగా ఆదరిస్తున్నటువంటి కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు.
Kiraak RP: మ్యాన్ పవర్ కావాలి…
నా బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. నా బిజినెస్ సక్సెస్ కావడం కోసం చాలా మంది సహకరించారని తెలిపారు. ఇక అదిరే అభి కూడా మీ ఓవర్సీస్ లో చేపల పులుసు పెట్టాలని కోరుకున్నారు దానికి మీ సమాధానం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా ఈ ప్రశ్నకు కిరాక్ ఆర్పీ సమాధానం చెబుతూ కచ్చితంగా తాను అమెరికాలో కూడా కిరాక్ ఆర్పీ చేపల పులుసు కర్రీ పాయింట్ ఏర్పాటు చేస్తానని తెలిపారు.కొద్దిగా అనుభవం మ్యాన్ పవర్ కనుక ఉంటే అమెరికాలో కూడా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ పెట్టి అమెరికాలో ఉన్న తెలుగు వారికి తన చేపల పులుసు రుచి చూపిస్తానని తెలిపారు. ఈ విషయానికి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. ఇలా తన చేపల పులుసు కర్రీ పాయింట్ గురించి కిరాక్ ఆర్పీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.