Klin Kaara: రామ్ చరణ్ ఉపాసన దంపతులు పెళ్లైన 11 సంవత్సరాలకు తల్లిదండ్రులకు ప్రమోట్ అయ్యారు. ఉపాసన ఈ ఏడాది జూన్ 20వ తేదీ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి క్లిన్ కారా కొణిదల అనే నామకరణం చేశారు. ఇక ఈ చిన్నారి గురించి ఏ విషయం బయటకు వచ్చినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే ఇప్పటివరకు మెగా వారసురాలు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ తాజాగా ఉపాసన మొదటిసారి తన కూతురి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే ఇందులో తన కుమార్తె ఫేస్ కనిపించే కనిపించిన విధంగా ఉండడంతో అభిమానులు కొంతమేర నిరుత్సాహం వ్యక్తం చేసిన మరోవైపు ఈ ఫోటో చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 15వ తేదీ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన కుమార్తె కూడా మొదటి స్వాతంత్ర దినోత్సవపు వేడుకలను జరుపుకున్నారు.స్వయంగా ఆమె జెండా ఎగరవేస్తూ ఉన్నటువంటి ఫోటోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఉపాసన తల్లిదండ్రులు తన కుమార్తెను ఎత్తుకొని ఉన్నారు. ఇందులో క్లిన్ కారా ట్రెడిషనల్ లుక్ లోలంగా జాకెట్ వేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఫోటోలో కొద్దిగా మాత్రమే చిన్నారి ఫేస్ కనిపించేలా ఉంది.
Klin Kaara: జెండా ఎగరవేసిన క్లిన్ కారా…
సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. క్లిన్ కారా ఫస్ట్ ఇండిపెండెన్స్ డే విత్ తాతయ్య అమ్మమ్మ.ఎంతో విలువైన అమూల్యమైన క్షణాలు అంటూ ఈమె ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా ఫాన్స్ మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇలా కొంత ఫేస్ మాత్రమే కనిపించేలా ఉన్న ఫోటోని షేర్ చేసిన ఉపాసన త్వరలోనే తమ కూతురి ఫేస్ రివిల్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ బుల్లి మెగా వారసురాలిని చూడటం కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.