Korata Shiva: తెలుగు ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయినా ఎన్టీఆర్ ఆ పై పలు సినిమాల్లో నటించి స్టార్ హీరో హోదాను దక్కించుకున్నాడు. ఇక ఇటీవల దర్శకధీరుడు తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో చక్రం తిప్పుతున్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాను పుట్టిన రోజు సందర్భంగా తను నటించే రెండు సినిమాల అప్ డేట్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో జూనియర్ ఎన్టీఆర్ పేరు హడావిడి చేస్తోంది. ఇక ఎన్టీఆర్ తాను తర్వాత చిత్రాలు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కొరటాల శివతో చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో అభిమానులకు ఈ సినిమాలపై మరింత ఆసక్తి నెలకొన్నది.
అభిమానులు ఇంకెక్కడ ఆగుతారు ఈ సినిమా విడుదల పై పూర్తిగా విచారణ జరుపుతున్నారు. ఇక తారక్ తన 30 ఓ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కాగా ఈ సినిమా యూనిట్ ఒక వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ వీడియోలో తారక బేస్ వాయిస్ తో చెప్పిన డైలాగ్ కు తన అభిమానుల్లో మరో లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి భారీ ఎత్తున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలుస్తుంది.
Korata Shiva: ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమాలో ఈమె పేరు బయట పెట్టలేదు!
ఇక ఈ వీడియో గ్లింప్స్ లో దర్శకుడు కొరటాల శివ తో పాటు మరికొందరు పేర్లు వినిపించాయి. కానీ ఒకరి పేరు మాత్రం కనిపించలేదు. ఇంతకూ ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకుడు కొరటాల శివ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ ఆర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబూ సిరిల్, ఇక ఎడిటర్ శ్రీకాంత్ పేరు మనకు వినిపించారు. కానీ హీరోయిన్ పేరు మాత్రం బయట పెట్టలేదు. ఇంతకు హీరోయిన్ ఎవరు? అని ఎన్టీఆర్ అభిమానులు ఆలోచన వ్యక్తం చేస్తున్నారు.