Kota Srinivasa Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాల నుంచి తిరుగులేని విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు కోట శ్రీనివాసరావు ఒకరు. ఈయన కొన్ని వందల సినిమాలలో తన విలనిజాన్ని చూపించే అందరినీ భయబ్రాంతులకు గురి చేశారు.ఈ విధంగా తన సినీ కెరీర్లో ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించిన కోటశ్రీనివాసరావు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈయన వయసు పైబడటంతో పూర్తిగా సినిమాలకు దూరం అయి యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో ఆసక్తికరమైన, సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావు గతంలో ఎన్నోసార్లు పలువురు హీరోల పై తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. తాజాగా మెగా ఫ్యామిలీ గురించి కోట శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గురించి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ముందు మీరు ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఆకలి మంటలతో అలమటిస్తున్న వారికి ఫుడ్ పెట్టండి అంటూ మెగాస్టార్ చిరంజీవి పై ఘాటుగా విమర్శలు చేశారు.సహాయం చేయమని అభ్యర్థించే వాళ్లకు మెగాస్టార్ ఎప్పుడు సహాయం చేయలేదు అంటూ కోటా మాట్లాడారు.
ఇకపోతే మెగాస్టార్ ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరిని మాత్రమే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ను సైతం కోటా వదలడం లేదు.ఆయనకు పెద్దగా నటనలో నైపుణ్యం లేదని ఏదో మెగాస్టార్ చిరంజీవి కొడుకు కావడంతో అలా ఇండస్ట్రీలో నెట్టుకొస్తున్నాడు అంటూ మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో మహేష్ బాబు ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుందని, రామ్ చరణ్ నటనలో పొటెన్షియాలీటీ లేదని ఈ సందర్భంగా కోట చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Kota Srinivasa Rao: కోటాకు ఏమైంది…
ఈ క్రమంలోనే కోట శ్రీనివాస్ రావు చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంతో మంది సినీ ప్రముఖులు, నెటిజన్లు స్పందిస్తూ అసలు కోట శ్రీనివాస్ రావుకి ఏమైంది? ఎందుకిలా ఆయన ఇండస్ట్రీలో ఉన్న హీరోల గురించి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు?తన 50 సంవత్సరాల సినీ కెరీర్లో ప్రతి ఒక్క హీరోను ఎంతో గొప్పగా పొగిడిన కోట శ్రీనివాసరావు ప్రస్తుతం తన సినీ కెరీర్ ముగిసిపోయిన సమయంలో హీరోల గురించి ఎందుకు ఈ విధమైనటువంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ చాలామంది ఈయన మాటలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.