Kovai Sarala: తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి కోవై సరళ ఒకరు. ఈమె తన కామెడీతో వెండి తెరపై సందడి చేస్తూ ప్రతి ఒక్కరి మొహంలోను నవ్వులు పూయించారు.ఈమె బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మరో లెవల్ అని చెప్పాలి.వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో వీరిద్దరూ కలిసిన నటించిన సినిమాలు కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ఇలా ఈమె తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం భాషలలో కూడా సినిమాలలో నటిస్తూ సందడి చేశారు.
ఈ విధంగా కోవై సరళ మూడు భాషలలో సుమారు 700కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ప్రస్తుతం ఈమె చాలా తక్కువ సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. కోవై సరళ వెండితెరపై అందరిని నవ్విస్తూ సందడి చేసిన ఈమె నిజ జీవితంలో మాత్రం ఆ నవ్వులు లేవని, ఆ సంతోషానికి ఆమె చాలా దూరంగా ఉన్నారని చెప్పాలి. ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే… కోవై సరళ తన ఇంట్లో పెద్దది కావడంతో కుటుంబ భారం మొత్తం తనపై పడింది.
Kovai Sarala: వ్యక్తిగత జీవితంలో సంతోషానికి దూరంగా కోవై సరళ…
తన తోబుట్టువుల బాగోగులు చూసుకోవడం కోసం ఈమె తన జీవితాన్ని త్యాగం చేసిందని చెప్పాలి.ఇలా కుటుంబాన్ని ముందుకు నడిపించడం కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకొని సినిమాలలో బిజీగా ఉన్న కోవై సరళ తన పెళ్లి గురించి తన జీవితం గురించి ఏమాత్రం ఆలోచించలేదు.ఇలా తన తోబుట్టువులను బాగా చదివించడంతో ప్రస్తుతం వాళ్లు విదేశాలలో స్థిరపడి చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈమెను మాత్రం పలకరించే దిక్కు కూడా లేకుండా పోయింది.ఇలా వారికోసం తన జీవితాన్నే త్యాగం చేసినప్పటికీ వాళ్లు మాత్రం ఆస్తికోసం ఏకంగా కోవై సరళను కోర్టుకు కూడా పిలిపించారు. తమ కోసమే జీవితాన్ని ధారబోసిన కోవై సరళ వయసు పైబడుతూ తనకు అవకాశాలు తగ్గడంతో తనని పలకరించే వారు కూడా లేరని తెలుస్తోంది. ఏది ఏమైనా కోవై సరళ వృత్తిపరమైన జీవితంలో సక్సెస్ అయిన విధంగా వ్యక్తిగత జీవితంలో సక్సెస్ కాలేకపోయిందని చెప్పాలి.