Krithi Shetty: ఒకే ఒక్క సినిమా కృతి శెట్టిని స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేర్చేసింది. ఉప్పెన సినిమా అవకాశానికి ముందు అమ్మడు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అవన్నీ తనకి ఉపయోగపడలేదు. ఎట్టకేలకు మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఉప్పెన సినిమాతో అవకాశం అందుకుంది. ఈ సినిమా సాధించిన సక్సెస్ అందరికంటే బాగా కలిసొచ్చింది హీరోయిన్ కృతి శెట్టికి. ఈ సినిమా రిలీజ్ కాకుండా ఐదారు సినిమాలలో హీరోయిన్‌గా అవకాశాలు దక్కాయి. ఇటీవల కాలంలో ఇలా దూసుకెళ్ళిన హీరోయిన్ మరొకరు లేరనే చెప్పాలి. అంతేకాదు, చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో లక్కీ హీరోయిన్‌గా మారింది.
అయితే, ఇప్పుడు కృతి కెరీర్‌ని డిసైడ్ చేసే సినిమాలు ఆ రెండే అని చెప్పుకుంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ పోతినేనికి మాస్ హీరోగా వచ్చిన క్రేజ్ ఆసాధారణం అని చెప్పాలి. ఈ సినిమా తర్వా రామ్ ఎక్కువగా మాస్ చిత్రాలనే ఎంచుకుంటున్నాడు. ఇక మొదటిసారి తమిళ ఇండస్ట్రీలో అడుగుపెడుతూ చేసిన తాజా చిత్రం ది వారియర్. ఈ సినిమాకు కోలీవుడ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు ఎన్ లింగు సామీ దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి హీరోయిన్. ఇప్పటికే, బుల్లెట్, విజిల్ సాంగ్స్‌లో అదరగొట్టింది. రామ్ సరసన మంచి జోడీ అని కామెంట్స్ వినిపించాయి. నేడు సినిమా విడుదలవుతోంది.
Krithi Shetty: పాన్ ఇండియా మూవీస్‌లో అవకాశాలు ..!
ఈ సినిమా రిజల్ట్ కృతికి క్రేజ్‌ను ఓ లెవల్‌కు తీసుకెళుతుంది. ఇక నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజిక వర్గం సినిమా ఆగస్టులో 12న రిలీజ్ కాబోతోంది. ఇందులో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఎడిటర్ ఎం ఎస్ రాజశేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. అయితే, ఈ సినిమా కూడా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. నితిన్‌కి కృతి మంచి జోడీ అని ఇప్పటికే ఫ్యాన్స్, మేకర్స్ చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కూడా హిట్ సాధిస్తే కృతికి ఇక పాన్ ఇండియా క్రేజ్ వచ్చేస్తుంది. మన స్టార్ హీరోల సరసన పాన్ ఇండియా మూవీస్‌లో అవకాశాలు అందుకుంటుంది. అదే ఈ రెండు సినిమాల ఫలితం తేడా కొడితే..మరోలా ఉంటుందనడంలో సందేహమే లేదు.