Krithi Shetty: తొలి చిత్రం ఉప్పెనతోనే ఇండస్ట్రీ హిట్ అందుకుంది యంగ్ యూటీ కృతిశెట్టి. సుకుమార్ లాంటి అగ్ర దర్శకుడు వెనక ఉండటం, మెగా హీరో డెబ్యూ సినిమా కావడంతో అందరి ఫోకస్ కృతిపై బాగానే పడింది. ఈ క్రమంలోనే మొదటి సినిమా హిట్ తర్వాత దాదాపు అరడజను సినిమాలను తెలుగులో కమిటైంది. దాంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను దక్కించుకున్న కృతిశెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే అమ్మడికి ఇప్పుడు తాజాగా కోలీవుడ్‌లో వరుస అవకాశాలు వరిస్తున్నాయి.
ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో సరసన ఓ సినిమా చేస్తున్న కృతిశెట్టి.. తాజాగా హీరో ధనుష్ నటించే కొత్త చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికచేసినట్టు సమాచారం. ఇప్పటికే, తమిళ యాక్షన్ చిత్రాల దర్శకుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తమిళం, తెలుగు భాషల్లో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పొతినేని నటించిన ‘ది వారియర్’ చిత్రంలో కృతిశెట్టి రోయిన్‌గా నటించింది. అలాగే, దర్శకుడు బాలా – హీరో సూర్య కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలోనూ కృతిశెట్టి హీరోయిన్.
Krithi Shetty: నంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంటుందని టాక్..
ఈ నేపథ్యంలో హీరో ధనుష్ ‘తిరుచిట్రాంబలం’, ‘నానే వరువేన్’ చిత్రాల తర్వాత అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీలో కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. వాస్తవంగా ముందు ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంకా అరుళ్ మోహన్‌ను ఎంపిక చేశారు. అయితే, తన డేట్స్ సమస్య రావడంతో ఆ ప్లేస్‌లోనే కృతిశెట్టిని మేకర్స్ ఫిక్స్ చేసుకున్నారట. ఇక తెలుగులో సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేస్తోంది. ఇప్పటికే తెలుగులో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. కృతిశెట్టి దూకుడు స్తుంటే త్వరలోనేమోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ అయిన పూజా హెగ్డే, రష్మిక మందన్నలను గట్టిగా కొట్టి నంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంటుందని టాక్ వినిపిస్తోంది.