Krithi Shetty తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి వచ్చిన అనతికాలంలో స్టార్ హోదాని దక్కించుకున్న నటీనటులలో తెలుగు యంగ్ బ్యూటీఫుల్ హీరోయిన్ కృతి శెట్టి ఒకరు. అయితే ఈ అమ్మడు తెలుగు యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముంబై బ్యూటీ.
వచ్చీరావడంతోనే ఈ అమ్మడి అందాలకి టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఒక్కసారిగా ఫీల్ అయ్యారు. అంతేకాకుండా ఈ బ్యూటీ ఉప్పెన చిత్రంలో నటించిన పాత్ర పేరు బెబమ్మ కావడంతో ఈ పేరుతోనే పిలుస్తూ బాగానే ఆదరిస్తున్నారు. కాగా ప్రస్తుతం నటి టాలీవుడ్లో చిత్ర పరిశ్రమంలో వరుస సినిమా క్యూ కడుతున్నాయి. అయితే ఇటీవలే ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన వారియర్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన ఫేవరెట్ హీరో ఎవరని విషయంపై స్పందించింది.
ఇందులో భాగంగా టాలీవుడ్ చలనచిత్రం పరిశ్రమలో తనకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అంటే చాలా ఇష్టం అని అలాగే రామ్ చరణ్ తో కలిసి నటించే అవకాశం వస్తే అసలు వదులుకోనని స్పష్టం చేసింది. ఇక ఇంటర్వ్యూ చేసేటటువంటి యాంకర్ ఎందుకు మీకు రాంచరణ్ అంటే అంత ఇష్టం అని అడగ్గా రామ్ చరణ్ గురించి తను ఉప్పెన చిత్రంలో నటించేటప్పటినుంచి తెలుసని అంతేకాకుండా చాలామంది కూడా రాంచరణ్ గురించి చాలా గొప్పగా చెప్పారని తెలిపింది. అలాగే తాను కూడా రెండుసార్లు రామ్ చరణ్ తో కలిసి మాట్లాడానని ఆ తర్వాత రామ్ చరణ్ పై ఉన్నటువంటి గౌరవం మరింత పెరిగిందని తెలిపింది.
ఈ విషయంలో ఉండగా అమ్మడు హీరోయిన్ గా నటించిన వారియర్ చిత్రం షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి తమిళ ప్రముఖ దర్శకుడు ఎన్. లింగస్వామి దర్శకత్వం వహించగా ప్రముఖ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించాడు. కాగా ఈ చిత్రం ఈనెల 14వ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.