Kriti Kharbanda: కృతికర్బంద తెలుగు ప్రేక్షకులకు ఈమె పరిచయమైన ప్రస్తుతం ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉంటున్నారు. ఈమె 2009వ సంవత్సరంలో అక్కినేని హీరో సుమంత్ తో కలిసి బోణి అనే సినిమాలో నటించారు.ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ నటి కృతికర్బంధకు మాత్రం మంచి అవకాశాలే వచ్చాయి. ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తీన్మార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ఒంగోలు గిత్త ఉస్తాద్ రామ్ వంటి సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు అదృష్టం ఏమాత్రం కలిసి రాలేదని చెప్పాలి.
ఇలా తాను నటించిన సినిమాలన్నీ కూడా సక్సెస్ కాకపోవడంతో తిరిగి ఈమె రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్లీ సినిమాలో ఏకంగా రామ్ చరణ్ కు అక్క పాత్రలో కూడా నటించారు.హీరోయిన్ గా మాత్రమే కాకుండా కనీసం అక్క పాత్రలలో కూడా ఈమె సక్సెస్ సాధించలేకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి కృతి కర్బందా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా నిత్యం తణుకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
Kriti Kharbanda: ఇదెక్కడి దారుణం రా బాబు…
ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా తాజాగా తన పెట్ డాగ్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తన కుక్కతో కలిసి రొమాంటిక్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా ఏకంగా లిప్ లాక్ చేస్తున్నటువంటి ఫోటోలు కూడా షేర్ చేయడంతో నేటిజన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటి కృతికర్బంధను ట్రోల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు ఈ ఫోటోలపై స్పందిస్తూ ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుందంటే ఇదేనేమో అంటూ కామెంట్ లు చేయగా మరి కొందరు మాత్రం కుక్కతో లిప్ లాక్ ఏంటి మరి దారుణంగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరొక నెటిజన్ అయితే ఏకంగా నేను కూడా నీకు కుక్కనై ఉంటే బాగుండేది అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈమే కుక్కతో కలిసి దిగిన ఈ రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.