Kriti Shetty: కృతి శెట్టి ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి సినిమాలోని ఎంతో మంచి సక్సెస్ అందుకొని బేబమ్మగా అందరికీ గుర్తుండిపోయినటువంటి ఈమె అనంతరం మరో రెండు సినిమాల సక్సెస్ అందుకున్నారు ఇలా వరుసగా మూడు సినిమాలు సక్సెస్ కావడంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి కానీ ఈమె నటించిన వరుస నాలుగు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు.
ఇలా తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఈమె నటించిన చిత్రాలు తమిళంలో కూడా విడుదల అయితే అక్కడ ఈమె నటనకు ఫిదా అయినటువంటి కోలీవుడ్ హీరోలు తమ సినిమాలలో కృతి శెట్టికి అవకాశాలు కల్పిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈమె తమిళ సినిమాలలో బిజీ అయ్యారు. ఇలా తమిళ సినిమాలతో బిజీగా ఉన్నటువంటి కృతి శెట్టి టాలీవుడ్ హీరోల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోలు సినిమాలు హిట్ అయితేనే హీరోయిన్లకు వాల్యూ ఇస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
Kriti Shetty: టాలీవుడ్ హీరోలు హిట్ మాత్రమే చూస్తారు…
సినిమా హిట్ అయితేనే ఆ హీరోయిన్లకు గుర్తింపు ఉంటుంది లేకపోతే టాలీవుడ్ హీరోలు ఆ హీరోయిన్లను ఏ మాత్రం పట్టించుకోరని తెలిపారు. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో అలా కాదు హీరోయిన్స్ విషయంలో సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా వారు పడిన కష్టాన్ని మాత్రమే గుర్తిస్తూ వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారని ఈ సందర్భంగా కోలీవుడ్ హీరోలపై ప్రశంసలు కురిపిస్తూ టాలీవుడ్ హీరోలను కరివేపాకుల తీసి పారేశారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా టాలీవుడ్ హీరోల గురించి ఈమె ఇలాంటి కామెంట్స్ చేయడంతో ముందు ముందు ఈమెకు అవకాశాలు రావడం కష్టంగానే మారుతుందని తెలుస్తుంది.