Kriti Shetty:.ఉప్పెన సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల నటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి హీరోయిన్గా మంచి గుర్తింపు సంతం చేసుకుంది. ఉప్పెన సినిమా మంచి హిట్ అవటంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి. ఇలా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా సాధారణంగా హీరో హీరోయిన్ల గురించి అనేక పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి.
ఈ క్రమంలో కృతి శెట్టి గురించి కూడా కొంతకాలంగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఒక స్టార్ హీరో కొడుకు కృతి శెట్టి వెంటపడుతూ ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెను వేధిస్తున్నాడని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈ వార్త వినిపిస్తోంది. అయితే రోజు రోజుకి ఈ వార్తలు మరింత ప్రచారం కావడంతో ఎట్టకేలకు కృతి శెట్టి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్టులో కృతి శెట్టి” ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కానీ ఈ రూమర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటిని అసలు నమ్మకండి” అంటూ రాసుకొచ్చింది.
Kriti Shetty:.నేను ఎక్కడ అలా చెప్పలేదు..
దీంతో కృతి శెట్టి గురించి వినిపిస్తున్న వార్తలకు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా కృతి శెట్టి సినిమాల విషయానికి వస్తే. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరుస విజయాలు అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతోంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో అవకాశాలు తగ్గినప్పటికీ ఇతర భాషల నుండి ఈ అమ్మడికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. తమిళ్ కన్నడ మలయాళం భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ కృతి శెట్టి ప్రస్తుతం బిజీగా ఉంది. అక్కడ ఈ అమ్మడు నటించిన సినిమాలు హిట్ అయితే ఈ అమ్మడి కెరీర్ కి ఎటువంటి డోకా ఉండదు