Kushboo సినిమా పరిశ్రమ ఏదైనప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు మాత్రం చాలా కామన్ గా ఉంటాయి. ఈ క్రమంలో కొందరు నటీనటులు అవకాశాల కోసం పడకగది కమిట్ మెంట్లతో సర్దుకుపోతూ ఉంటే మరికొందరు మాత్రం నిర్మొహమాటంగా మొహం మీదే నో చెప్పేసి వెళుతుంటారు. అయితే తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, మోహన్ బాబు, తదితర స్టార్ హీరోల సరసన నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఖుష్బూ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. కాగా నటి ఖుష్బూ ఎప్పుడూ కూడా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్లు ప్రవర్తిస్తుంది.
కాగా అప్పట్లో టాలీవుడ్ సినిమా పరిశ్రమకి చెందిన ఓ ప్రముఖ హీరో మరియు ఖుష్బూకి జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇంతకీ ఆ విషయం ఏమిటంటే అప్పట్లో హీరోయిన్ ఖుష్బూ ఓ తెలుగు ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో అదే చిత్రంలో హీరోగా నటిస్తున్న ఓ తెలుగు హీరో నటి ఖుష్బూ తో అసభ్యంగా ప్రవర్తిస్తూ పడకగది కమిట్మెంట్ అడిగాడట. దాంతో నటి ఖుష్బూ ఏమాత్రం భయపడకుండా ఆ హీరో కూతురు ని తన తమ్ముడు గదిలోకి పంపిస్తే తాను ఆ హీరోకి పడకగది కమిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరిస్తానని మొహం మీదే చెప్పేసిందట. అంతేకాకుండా మరోమారు తనతో ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తే చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చిందట. దీంతో ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ తెలుగు ప్రముఖ నటుడు మరియు నటి ఖుష్బూ కి మధ్య మాటలు లేవని కొందరు చర్చించుకుంటున్నారు. కానీ ఇంత జరిగినప్పటికీ నటి ఖుష్బూ ను పడక గది కమిట్మెంట్ అడిగినటువంటి హీరో ఎవరనేది మాత్రం బయటకి రాలేదు. దీంతో కొందరు నెటిజన్లు హీరోయిన్ తో నీచంగా ప్రవర్తించిన ఆ తెలుగు హీరో ఎవరు అంటూ సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి ఖుష్బూ సినిమా జీవితంలో మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో రాజకీయాలలోకి కూడా వచ్చింది. ఈ క్రమంలో గత ఏడాది జరిగిన తమిళనాడు సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసింది. కానీ దురదృష్టవశాత్తూ ఓటమి పాలైంది. అయినప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంది. కాగా ప్రస్తుతం నటి ఖుష్బూ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న పెద్దన్న ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.