Kushita Kallapu ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో కొందరి నటీనటులకు బాగానే కలసిస్తోంది. అంతేకాకుండా కొందరి వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు. అంతేకాకుండా కొంతమందయితే ఏకంగా బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో అలాగే సినిమాల్లో నటించే ఆఫర్లు కూడా దక్కించుకున్నారు.
అయితే తెలుగులో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి బాగానే పాపులర్ అయినటువంటి కుషిత కల్లపు కూడా ఈ కోవకే చెందుతుంది. అయితే నటి కుషిత ఆ మధ్య హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఓ ప్రముఖ పబ్ లో జరిగిన రైడ్ లో పోలీసులకు చిక్కడంతో ఒక్కసారిగా పాపులర్ అయింది. అయితే ఈ రైడ్ లో చిక్కినప్పుడు నటి కుషిత కేవలం చీజ్ బజ్జీలు తినడానికి పబ్ కి వెళ్లినట్లు పోలీసుల విచారణలో చెప్పింది. దీంతో అప్పటినుంచి ఈ అమ్మడిని సోషల్ మీడియా మాధ్యమాలలో ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.
దీంతో ఈ మధ్యకాలంలో కుషిత కూడా ఈ క్రేజ్ ని బాగానే ఉపయోగించుకుంటూ సినిమా ఆఫర్లు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు వరుసగా ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఘాటుగా అందాలు ఆరబోస్తూ మతి పోగొడుతోంది. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని గాగ్రా చోళీ దుస్తులు ధరించి నాభి అందాలు ఆరబోస్తూ క్యూట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఈ ఫోటోలు చూసిన జనాలు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అంతేకాకుండా నటి ఖుషి తాకి అందం అభినయం నటన ప్రతిభ వంటివి మెండుగా ఉన్నాయని కాబట్టి తన ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం వస్తే ఖచ్చితంగా హీరోయిన్ రేంజ్ కి వస్తుందని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ అందాల బొమ్మ కి సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ రోల్స్ కి చాలాబాగా పనికొస్తుందని మరికొందరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి కుషిత పలు లఘు చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుని బిజీ బిజీ షెడ్యూల్ తో దూసుకుపోతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిన్నపాటి బడ్జెట్ చిత్రంలో సైడ్ హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.