Lakshmipati: టాలీవుడ్ కమెడియన్ లక్ష్మీపతి గురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లో తన కామెడీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పటికే ఆయన కామెడీ సీన్లు హైలెట్ గా ఉంటాయి. సునీల్, లక్ష్మీపతి కాంబినేషన్‌లో వచ్చిన కామెడీ సీన్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పుకవోచ్చు.
ఆంధ్రుడు, కితకితలు, పెదబాబు, అల్లరి సినిమాల్లో లక్ష్మీపతి కామెడీ చాలా బాగుంటుంది. అయితే 2008లో లక్ష్మీపతి కన్నుమూసిన విషయం తెలిసిందే. లక్ష్మీపతి చనిపోవడానికి నెల రోజుల ముందు ఆయన తమ్ముడు శోభన్ గుండెపోటుతో చనిపోయాడు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీపతి కూతురు శ్వేతా లక్ష్మీపతి కీలక విషయాలు వెల్లడించింది.తన బాబాయ్ శోభన్ చనిపోయిన సమయంలో తన తండ్రి లక్ష్మీపతి బాగా ఏడ్చినట్లు చెప్పారు.
బాబాయి చనిపోయిన సమయంలో తనను పట్టుకుని నాన్న ఏడ్చేశారని, ఆ బాధను మర్చిపోవడానికి తాగేసి ఇంటికొచ్చేవారని శ్వేతా లక్ష్మిపతి తెలిపింది. బాబాయి మరణాన్ని నాన్న జీర్ణించుకోలేకపోయారని, ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారని తెలిపారు. నాన్న తాగి వచ్చినప్పుడు ఆయనతో గొడవపడ్డానని శ్వేతా లక్ష్మిపతి తెలిపారు. అయితే అందరూ ఏడుస్తున్నా తాను ఏడ్చేవాడిని కాదని, అందరూ నిద్రపోయాక రాత్రి సమయాల్లో ఏడ్చేవాడినని శ్వేతా లక్ష్మిపతి తెలిపారు.
Lakshmipati:
అలాగే తన తండ్రి చనిపోయినప్పుడు తాను ఏడిస్తే తన కన్నా చిన్నవాళ్లు అయిన తన తమ్ముడు, బాబాయి కొడుకులు భయపడతారని శ్వేతా లక్ష్మీపతి స్పష్టం చేశారు. తన బాబాయి కొడుకుల బాధ్యత కూడా తాను తీసుకున్నానని శ్వేతా లక్ష్మిపతి తెలిపారు. కృష్ణ నటించిన రైతుభారతం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా శోభన్ పనిచేశారు.తర్వాత మహేష్ బాబుతో బాబీ సినిమా చేసే అవకాశం ఇచ్చింది. ఆ సినిమా ఓపెనింగ్ సమయంలో తాను మహేష్ బాబు, కృష్ణను తొలిసారి చూశానని శ్వేతా లక్ష్మీపతి తెలిపారు.