Upasana -Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి రామ్ చరణ్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈయన ఉపాసన అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు వీరి వివాహం జరిగి 11 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శ దంపతులుగా నిలిచారు.
ఇక ఈ దంపతులకు ఇటీవలే కూతురు జన్మించిన సంగతి తెలిసింది. ఇలా తమ కూతురు పుట్టిన తర్వాత తమ జీవితంలో మరింత ఆనందం పెరిగిందని వెల్లడించారు. అయితే వరుణ్ తేజ్ పెళ్లి సమయంలో ఉపాసన రాంచరణ్ మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తుంది. ఉపాసన కోసం రామ్ చరణ్ ఎంతో ఖరీదైనటువంటి వాచ్ కోనుగోలు చేసి ఆమెకు కానుకగా ఇచ్చారట. ఇలా ఎంతో ప్రేమగా తన భార్య కోసం రామ్ చరణ్ ఈ వాచ్ సెలెక్ట్ చేసి తనకు కానుకగా ఇవ్వడంతో అది చూసినటువంటి ఉపాసనకు ఏమాత్రం నచ్చలేదని ఆ గిఫ్ట్ విసిరి కొట్టిందట.
రామ్ చరణ్ ఉపాసన మధ్య విభేదాలు…
అంతేకాకుండా ఆ వాచ్ కోసం రాంచరణ్ ఖర్చు చేసిన డబ్బు చూసి కూడా ఆమె ఇలాంటి ఒక చెత్త వాచ్ కోసం ఇంత డబ్బు వేస్ట్ చేసావా అంటూ రాంచరణ్ పట్ల ఉపాసన సీరియస్ అయ్యారని తెలుస్తుంది. ఇలా 11 సంవత్సరాల వైవాహిక జీవితంలో మొదటిసారి ఉపాసన రాంచరణ్ మధ్య విభేదాలు వచ్చాయి అంటూ ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఉపాసన రాంచరణ్ గురించి ఈ వార్త వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.