Anushka: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం వరస హిట్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోయారు. ఇక బాహుబలి సినిమా తర్వాత మూడు సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి అనుష్క తాజాగా నవీన్ పోలీస్ శెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈమె ఇతర భాష సినిమాలకు కూడా కమిట్ అయ్యారు.
ఇకపోతే ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్కువ కాలం పాటు కొనసాగాలి అంటే చాలా అందంగా ఉండాలి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అందం రెట్టింపు చేసుకోవడం కోసం సినిమా సెలబ్రిటీలందరూ కూడా సర్జరీలు చేయించుకుంటూ మరింత రెట్టింపు అందాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు సర్జరీలు చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నటి అనుష్క సైతం సర్జరీకి సిద్ధమైంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. మరి అనుష్క ఏ పార్ట్ కి సర్జరీ చేయించుకోబోతుంది అనే విషయానికి వస్తే…
మోకాలి సర్జరీ…
అనుష్క గత కొంతకాలంగా మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నారట ఇలా ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి ఈమె ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా నొప్పి తగ్గలేదని అందుకే డాక్టర్లు తనకు చిన్న సర్జరీ చేయాలనీ సజెస్ట్ చేశారట ఇలా సర్జరీ చేయాలని చెప్పడంతో ఈమె విదేశాలకు వెళ్లి మోకాలి సర్జరీ చేయించుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా సర్జరీ చేయించుకున్న తర్వాత ఈమె కొంతకాలం పాటు విరామం తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో ఈమె కమిట్ అయినటువంటి సినిమాలకు తీసుకున్నటువంటి అడ్వాన్స్ కూడా తిరిగి వెనక్కి ఇస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి అనుష్క గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే ఈ వార్తలపై అనుష్క స్పందించాల్సి ఉంది.