Nara Brahmini: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోల వారసులు వారసురాళ్ళు అడుగుపెట్టి తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎంతోమంది హీరోల వారసురాలు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు. నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే. మోక్షజ్ఞఎంట్రీ కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక బాలకృష్ణ కూతుర్ల విషయానికి వస్తే హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని అందం టాలెంట్ వీరీ సొంతమని చెప్పాలి.
ఇలా ఎంతో అందంగా ఎంతో టాలెంట్ కలిగినటువంటి ఇద్దరు ఇండస్ట్రీలోకి వస్తారని అందరూ భావించారు. కానీ బాలయ్య మాత్రం తమ కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. ఇక బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వస్తుందని అందరూ భావించారు .ఈ క్రమంలోనే కొంతమంది దర్శక నిర్మాతలు బాలకృష్ణ వద్దకు వెళ్లి తన కుమార్తెను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తాము అని బాలయ్యను అడిగారట. అయితే బాలకృష్ణ మాత్రం అందుకు ఒప్పుకోకపోవడంతోనే ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని తెలుస్తుంది.
సినిమాలంటే ఆసక్తి లేదా…
బాలకృష్ణ కారణంగానే, తాను ఒప్పుకోకపోవడం వల్లే బ్రాహ్మణి హీరోయిన్ కాలేకపోయిందని లేకపోతే ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగేదని తెలుస్తుంది. అసలు బాలకృష్ణ ఎందుకు ఒప్పుకోలేదు అనే విషయానికి వస్తే.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ ఈమెకు సినిమాలు అంటే ఏమాత్రం ఆసక్తి లేదట చిన్నప్పటినుంచి కూడా సినిమాలంటే పెద్దగా ఇష్టపడనటువంటి ఈమె వ్యాపార రంగంలో కొనసాగాలని భావించారట అందుకే బాలకృష్ణ కూడా తనని తనకి ఇష్టమైన రంగంలో కొనసాగేలా ప్రోత్సహించారు. అందుకే ఈమె వ్యాపార రంగంలో దూసుకుపోతూ బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ సాధించారని చెప్పాలి. ప్రస్తుతం నారా వారి ఇంటి కోడలుగా అడుగుపెట్టినటువంటి ఈమె హెరిటేజ్ సంస్థలను ముందుకు నడిపించడమే కాకుండా బసవతారకం హాస్పిటల్ బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు.