Tammanah: టాలీ వుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు 40 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ ఈమె వరసగా హీరోయిన్ అవకాశాలను అందుకుంటున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి తమన్న నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా తమన్నా గురించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమన్నా పెళ్లి కాకుండానే తల్లిగా మారబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త సంచలనంగా మారింది. దీంతో అభిమానులు నేటిజన్స్ ఒకసారిగా షాక్ అవుతున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో పెళ్లి కాకుండా తల్లి కావడమే ట్రెండా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే నిజంగానే తమన్న తల్లి కాబోతోంది అనుకుంటే మనం పొరపాటు పడినట్లే ఈమె ఒక సినిమాలో తల్లి పాత్రలో నటించబోతోంది అందుకే ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హీరోయిన్ కి తల్లిగా తమన్నా..
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తే ఎంతో బిజీగా ఉన్నటువంటి తమన్న ఓ సినిమాకు కమిట్ అయ్యారట. ఈ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో హీరోయిన్ కు తల్లిగా నటించే పాత్రకు ఈమె కమీట్ అయ్యారని తెలుస్తుంది. ఈ విధంగా తమన్న మరొక హీరోయిన్ కి తల్లిగా నటించబోతుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. హాట్ బ్యూటీగా ఎన్నో అద్భుతమైన సినిమాలలోను వెబ్ సిరీస్ లలో హీరోయిన్గా నటిస్తున్నటువంటి తమన్న ఇలా తల్లి పాత్రలలో నటించడం ఎంతవరకు సమంజసం అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సినిమా డైరెక్టర్ డైరెక్షన్లో నటించాలన్నది తమన్నా ఎప్పటినుంచో కల కావడంతో ఈ అవకాశాన్ని ఇలా ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది.