Lavanya Tripati: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నటువంటి లావణ్య త్రిపాఠి అనంతరం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడటం వీరిద్దరూ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడం జరిగింది. ఇలా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు కూడా ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మిస్టర్ సినిమాలో కలిసిన నటించారు. ఇలా వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది అలాగే లావణ్య త్రిపాటికి నిహారిక మధ్య కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందని తెలుస్తుంది. వీరిద్దరికి జిమ్ లో పరిచయం ఏర్పడిందట ఇలా ఈ పరిచయం కారణంగానే లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీకి మరింత దగ్గరయ్యారు దీంతో ప్రేమను గెలిపించుకోవడానికి కూడా మరింత సులభతరం అయింది. పక్కన పెడితే నిహారిక పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు. అయితే ఈమె కెరియర్ పరంగా మాత్రం ఎంతో బిజీ అవుతున్నారు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాలు చేస్తూ నిర్మాతగా మారారు.
నిహారిక ప్రొడక్షన్లో వరుణ్ లావణ్య…
ఇకపోతే లావణ్య త్రిపాఠి పెళ్లయిన తర్వాత ఎవరు కూడా చేయనటువంటి త్యాగాన్ని నిహారిక కెరియర్ కోసం త్యాగం చేస్తున్నారని తెలుస్తుంది. నిహారిక పెళ్లి తర్వాత పిల్లల గురించి ముందుగానే ప్లాన్ చేసుకున్నారట. పెళ్లయిన వెంటనే తమకు పిల్లలు కావాలని ప్లాన్ చేసుకున్నారని అయితే నిహారిక మాత్రం వరుణ్ తేజ్ లావణ్యని ఒక చిన్న రిక్వెస్ట్ చేశారట. తన ప్రొడక్షన్ హౌస్ లో వరుణ్ లావణ్య ఇద్దరు కూడా ఒక సినిమాలో నటించాలని కోరారట. ఇలా ఆడపడుచు కోరడంతో వదిన కూడా కాదనలేక నిహారిక ప్రొడక్షన్ లో వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారు. దీంతో అమ్మగా మారాలనుకుంటున్నటువంటి లావణ్య త్రిపాఠి మరి కొన్ని నెలలు పాటు అమ్మ అవ్వాలనే ఆలోచన పక్కన పెట్టారని తెలుస్తోంది.