Lavanya Tripati: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మెగా డాటర్ నిహారిక విడాకుల వార్తా సంచలనంగా మారింది. జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న నిహారిక ఇటీవల అతనితో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేసినట్లు వెల్లడించింది. దీంతో ప్రస్తుతం నిహారిక గురించి ఆమె ప్రవర్తన గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక చేసిన పొరపాట్ల వల్లే చైతన్య ఆమెకు విడాకులు ఇచ్చాడని, పెళ్లి తర్వాత కూడా నిహారిక తన పద్ధతి మార్చుకోకపోవడంతో ఆమెను భరించలేక చైతన్య ఆమెకు దూరంగా ఉండటానికి నిశ్చయించుకున్నట్లు అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలా గత కొన్ని రోజులుగా నిహారిక గురించి అనేక విమర్శలు వినిపిస్తున్న తరుణంలో నాగబాబు కూడా తన కూతురి మీద సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత నిహారిక భర్తతో చక్కగా కాపురం చేయకుండా ఇలాంటి పనులు చేయటంతో నాగబాబు కూతురు మీద మొదటిసారిగా కోప్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో మాత్రం కొత్త కోడలు లావణ్య మాత్రం తన మామ నాగబాబుని ఎదురించినట్లు తెలుస్తోంది. మెగా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టక ముందే ఆడపడుచుకి అండగా నిలవడానికి నాగబాబుని ఎదురించి మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Lavanya Tripati: ఆడపడుచుకు మద్దతుగా నిలబడిన లావణ్య…
చైతన్యతో విడాకులు తీసుకోవటానికి నిహారిక సిద్ధపడటంతో మెగా కుటుంబ సభ్యులందరూ ఎంత చెప్పినా కూడా ఆమె వినకుండా విడాకుల కోసం దరఖాస్తు చేసింది. దీంతో నాగబాబు కూతురు మీద చేయి చేసుకోవడంతో లావణ్య తన ఆడపడుచు నిహారిక కు అండగా నిలబడి ..” నిహారిక అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని, అందువల్ల ఇలాంటి క్లిష్ట సమయంలో తనని దూరం పెట్టకుండా మనమే తనకి అండగా నిలవాలని” నాగబాబుకి లావణ్య సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా పెళ్లి కాకుండానే లావణ్య ఇంటి బాధ్యతలు తీసుకొని ఒక తల్లిలా నిహారికకు అండగా నిలిచింది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.