Lavanya Tripathi: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ గత కొన్ని రోజుల నుండి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరు కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో వరుణ్ ఏకంగా డైమండ్ రింగ్ తో ప్రపోజ్ చేశాడని తెలిసింది. ఇక ఈ విషయం గురించి తాజాగా లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చింది.
లావణ్య, వరుణ్ గతంలో మిస్టర్, అంతరిక్షం సినిమాలలో కలిసి జంటగా నటించారు. ఇక ఈ సినిమాలు అంతగా సక్సెస్ కాలేకపోయినా వీరిద్దరి బంధానికి మాత్రం బాగానే కలిసి వచ్చింది. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారని అంతేకాకుండా త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి.
గతంలో లావణ్య వరుణ్ పుట్టినరోజు వేడుకలో కూడా హాజరయ్యిందని.. మెగా ఫ్యామిలీతో కలిసి ఫోటో కూడా దిగిందని ఓ ఫోటో బాగా వైరల్ గా మార్చారు నెటిజెన్లు. ఇక వరుణ్ కూడా తన బర్త్ డే రోజు లావణ్య త్రిపాఠి కోసం బెంగళూరుకి వెళ్ళాడని.. ఏకంగా డైమండ్ రింగ్ ఇచ్చి తనకు ప్రపోజ్ చేశాడని పుకార్లు వచ్చాయి.
కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదని లావణ్య గతంలో తను షేర్ చేసుకున్న వీడియోల ద్వారా క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా వీరి మధ్య బంధం గురించి మళ్లీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ విషయం గురించి తాజాగా లావణ్య క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె హ్యాపీ బర్త్డే సినిమాలో నటించగా.. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Lavanya Tripathi: వరుణ్ తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..
ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా.. తనకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఒక హీరోని పెళ్లి చేసుకుంటానని వార్తల్లో ప్రచారాలు వచ్చాయి అని.. ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది. ఇక తనకు పెళ్లి జరగలేదని.. పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని తెలిపింది. ఇక తనకు ఉన్న ప్రెషర్ వల్ల బయట వెకేషన్స్ కి వెళ్తాను అని.. పెళ్లి చేసుకునే సమయం వస్తే అందరితో చెప్పుకుంటాను అని.. తెలిపింది. ఇక ప్రస్తుతం ఆమె తన పెళ్లి గురించి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.