Lavanya Tripati: నటి లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే వీరిద్దరూ రహస్యంగా ప్రేమ ప్రయాణం కొనసాగిస్తూ ఎట్టకేలకు పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. త్వరలోనే వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇలా వీరి పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో లావణ్య త్రిపాఠి గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈమె వరుణ్ తేజ్ ప్రేమలో పడక ముందు పలువురు హీరోలతో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.
మెగా కాంపౌండ్ లోనే ఈమె సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ వంటి వారితో ప్రేమ ప్రయాణాలు నడిపారని వార్తలు వచ్చాయి.అయితే వీరితో మాత్రమే కాకుండా ఈమె నటించిన మొదటి సినిమా అందాల రాక్షసి ఈ సినిమాలో నవీన్ చంద్ర రాహుల్ రవీంద్ర హీరోలుగా నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే నవీన్ చంద్రతో ఉన్న పరిచయం కారణంగానే లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో నటించారట అయితే ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఆ ప్రేమ కారణంగానే మరో రెండు సినిమాలలో కలిసి నటించారని తెలుస్తుంది.
Lavanya Tripati: నవీన్ చంద్రతో బ్రేకప్…
ఇలా నవీన్ చంద్ర లావణ్య త్రిపాఠి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండా బ్రేకప్ చెప్పుకోవడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. నవీన్ చంద్ర వరుస సినిమాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు అయితే ఈయన నటించిన సినిమాలు ఏవి సక్సెస్ కాలేదు దీంతో ఈయనకు క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా సినిమా ఇండస్ట్రీలో నవీన్ చంద్రకు అవకాశాలు తగ్గిపోవడంతోనే లావణ్య త్రిపాఠి తనని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపకపోవడమే కాకుండా తనతో బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. ఇలా నవీన్ చంద్రతో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడ్డారు.