Lavanya Tripathi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల గురించి డేటింగ్ రూమ్స్ రావడం సర్వసాధారణం ఈ క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్ అలాగే నటి లావణ్య గురించి కూడా పెద్ద ఎత్తున ఇలాంటి రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఇక వీరిద్దరూ లవ్ లో ఉన్నారని త్వరలోనే ఇద్దరు పెళ్లికూడా చేసుకోబోతున్నారట పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై లావణ్య త్రిపాఠి ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఈ వార్తలను కొట్టి పారేశారు.
తాజాగా లావణ్య త్రిపాఠి నటించిన చిత్రం పులిమేక.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం మొత్తం సుమా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సుమ అడ్డా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ గురించి పలు విషయాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సుమ లావణ్య త్రిపాఠినీ ప్రశ్నిస్తూ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు? A నాని B వరుణ్ తేజ్ అనే ఆప్షన్లు ఇచ్చింది. ఇలా రెండు ఆప్షన్లు ఇవ్వడంతో లావణ్య త్రిపాఠి ఒకేసారి వరుణ్ తేజ్ అనే సమాధానం చెప్పింది. ఇలా ఈమె మెగా హీరో వరుణ్ తేజ్ హ్యాండ్సమ్ హీరో అంటూ తనపై ఉన్నటువంటి క్రష్ బయటపెట్టారు. ఇలా ఈమె సమాధానం చెప్పడంతో అక్కడున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Lavanya Tripathi:తెరపైకి డేటింగ్ రూమర్స్….
లావణ్య త్రిపాటి ఇలాంటి సమాధానం చెప్పడంతో నేటిజన్స్ సైతం ఈ సమాధానం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఈమెకు వరుణ్ తేజ్ అంటే ఇలాంటి క్రష్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఈమె ఇలాంటి సమాధానం చెప్పడంతో మరోసారి వీరిద్దరూ డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి.ఇక వీరిద్దరూ కలిసి మిస్టర్ అంతరిక్షం అనే రెండు సినిమాలలో నటించారు. ఈ రెండు సినిమాలలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.