Lavanya Tripati: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇలా మెగా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ఈయన వరుస సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరి వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ పెళ్లి వేడుకలలో భాగంగా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని సందడి చేశారు. అలాగే రిసెప్షన్లో కూడా సెలబ్రిటీలందరూ హాజరై సందడి చేశారు.
ఈ విధంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ వివాహమైన అనంతరం వీరిద్దరూ మొదటిసారి నిహారిక సినిమా పూజా కార్యక్రమాలలో జంటగా సందడి చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వరుణ్ తేజ్ లావణ్య తమ కెరియర్ గురించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో లావణ్య త్రిపాఠి షాకింగ్ నిర్ణయం తీసుకుందని పిల్లల విషయంలో ఈమె ఉపాసనని అనుసరిస్తుందని తెలుస్తుంది. ఉపాసన రాంచరణ్ పెళ్లయిన తర్వాత 11 సంవత్సరాలకు పిల్లలను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే లావణ్య త్రిపాఠి కూడా కొంత సమయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది.
ఉపాసనని అనుసరిస్తున్న లావణ్య..
లావణ్య పెళ్లి చేసుకున్నప్పటికీ ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి మెగా కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు అలాగే ఈమె సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించాలని భావిస్తున్నారట. వీటితో పాటు బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టి ఫ్యాషన్ డిజైనింగ్ దుస్తులను అత్యంత చౌక ధరకే అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఒక వెబ్ సైట్ కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. ఇలా తనకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయని ఆ డ్రీమ్స్ పూర్తి అయిన తర్వాత పిల్లల గురించి ఆలోచించాలని ఈమె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పిల్లల విషయంలో లావణ్య త్రిపాఠి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఈమె కూడా తన అక్కయను ఫాలో అవుతుందని… అక్క ఉపాసన పది సంవత్సరాలకు పిల్లలను ప్లాన్ చేస్తే మరి లావణ్య ఎన్ని సంవత్సరాలకు ప్లాన్ చేస్తుందో తెలియాల్సి ఉంది.