Laya : హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోని మాజీ స్టార్ హీరోయిన్ కూతురు….

Joythi R

Laya : లయ. ఈ పేరు వినగానే 96 కాలంలో పలు లవ్ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు వంటి ప్రముఖ బ్యూటిఫుల్ హీరోయిన్ గుర్తొస్తుంది. అయితే నటి లయ తెలుగు రాష్ట్రాల నుంచి టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి పలువురు హీరోయిన్ల లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే నటి లయ ఎక్కువగా లవ్ మరియు సెంటిమెంటల్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. అలాగే చక్కని ముఖకవళికలు అందం అభినయం చీర కట్టు వంటివాటితో సినీ ప్రేక్షకులను కట్టి పడేసింది.

అంతేకాకుండా ఓవర్ ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉండటం, మరియు ఇతర నటీనటులతో కూడా మంచి ప్రవర్తన మెలగడం వంటి వాటి కారణాలతో నటి లయ కి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉండేది. అయితే ఏమైందో ఏమో గాని నటి లయ వరుసగా హీరోయిన్ గా మంచి ఆఫర్లతో రాణిస్తున్న సమయంలో ప్రముఖ డాక్టర్ శ్రీ గణేష్ అనే ప్రముఖ వైద్యుడిని పెళ్లి చేసుకుని ఇతర దేశాలలో సెటిలైపోయింది. కాగా ప్రస్తుతం వీరికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు. వీరి పేర్లు శ్లోక మరియు వచన్

దీంతో నటి లయ అభిమానులు ఒక్కసారిగా తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే నటి లయ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇందులో నటి లయ తాజాగా తన భర్త మరియు ఇద్దరు పిల్లలతో కలిసి విహార యాత్రకు వెళ్లి సరదాగా కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

అయితే ఎప్పుడు తన ఫ్యామిలీ విషయాలను సోషల్ మీడియాకి దూరంగా ఉంచటం వంటి మాటల ఒక్కసారిగా తన భర్త పిల్లలతో కలిసి దిగినటువంటి ఫోటో షేర్ చేయడంతో నటి లయ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నటి లయ కూతురు శ్లోక కూడా తన తల్లి మాదిరిగానే చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే నటి లయకి 40 ఏళ్ల వయసు పైబడిన ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -