Maadhavi Latha : తెలుగు సినీ ప్రియులకు హీరోయిన్ మాధవి లత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తనీష్ హీరోగా నటించిన నచ్చావులే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది. ఆ తర్వాత స్నేహితుడా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
మొత్తానికి మాధవిలత తెలుగు ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఈ అమ్మడు కు ఏమనిపించిందో కానీ తెలుగు సినిమాలకు క్రమంగా బ్రేక్ ఇచ్చేసింది. ఈ ముద్దు గుమ్మ అనంతరం ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టింది. ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ నెటిజన్ల కు మంచి ఉంటుంది. ఏదో ఒక వివాదాన్ని తట్టిలేపి సోషల్ మీడియాలో, వార్తల్లో వైరల్ గా మారుతుంది మాధవిలత.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని చెప్పుకుంటూ హడావిడి చేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో విచిత్రమైన పోస్టులు పెడుతూ వార్తలలో ఒక రేంజ్ లో హడావిడి చేస్తోంది. ఇదిలా ఉంటే మాధవీలత బెజవాడ దుర్గమ్మ ను దర్శించుకున్నది. అమ్మవారి దర్శనం బాగా జరిగిందా అని తన పోస్ట్ నెట్టింట్లో పంచుకుంది. అయితే ఒక ఆకతాయి ఈ పోస్ట్ కి విచిత్రంగా స్పందించాడు.
Maadhavi Latha : మాధవి లత ఆ నెటిజన్ కు ఈ విధంగా బుద్ధి చెప్పింది!
అక్క అని.. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని అన్నాడు. నువ్వంటే చాలా ఇష్టం అక్కా నన్ను పెళ్లి చేసుకో అక్క అని కామెంట్ రూపంలో అడిగాడు. దీనికి అసహనం వ్యక్తం చేసిన మాధవిలత అక్క ని పెళ్లి చేసుకుంటావా హౌలే , గూట్లే అని అనాలని ఉంది. కానీ ఆనను అంటూ కామెంట్ లో మెన్షన్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టుకు సంబంధించిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.