Madhu Priya: సింగర్ మధుప్రియ పరిచయం అవసరం లేని పేరు ఫోక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మధుప్రియ ఎన్నో స్టేజీలపై ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈమె సింగర్ గా ఇండస్ట్రీలో ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ప్లే బ్యాక్ సింగర్ గాను అలాగే ప్రవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఉన్నారు. ఇక మధుప్రియ అంటేనే ఈమె పెళ్లి , పెళ్లి సమయంలో జరిగిన వివాదం గురించి అందరికీ గుర్తుకు వస్తుంది.మధుప్రియ 18 సంవత్సరాలు రాగానే తాను ప్రేమించిన వ్యక్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు..
వివాహం చేసుకున్న సమయంలో శ్రీకాంత్ నేను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామని అయితే మా ప్రేమకు తల్లిదండ్రుల అడ్డుగా ఉన్నారంటూ తల్లిదండ్రులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే తన భర్త శ్రీకాంత్ తనని కట్నం కావాలని వేధిస్తున్నాడు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పెద్ద ఎత్తున వివాదంగా మారింది.తల్లిదండ్రులు ఎదిరించి ఎవరు ప్రేమ వివాహాలు చేసుకోకూడదని ఈమె తల్లిదండ్రుల గొప్పతనం గురించి మరోసారి అందరికీ హితబోధ చేశారు. అయితే కేసు పెట్టిన 24 గంటల్లోనే మధుప్రియ కేసు వెనక్కి తీసుకున్నారు.
Madhu Priya: కెరియర్ విషయంలో కండిషన్స్..
ఇలా 18 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకున్నటువంటి మధుప్రియ ప్రస్తుతం తన భర్తకు విడాకులు ఇచ్చి తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. అయితే ఈమె విడాకులకు కారణం ఏంటి అనే విషయానికి వస్తే పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీకాంత్ తనని పలు స్టేజి షోలలో పాల్గొనడానికి అంగీకరించేవారు కాదట నువ్వు ఇలా ఎప్పటి పడితే అప్పుడు స్టేజ్ పై పాటలు పాడుతూ డాన్స్ వేస్తూ ఉంటే మా ఇంటి పరువు పోతుంది. అందుకే ఎక్కడికి వెళ్లడానికి వీలులేదని కండిషన్స్ పెట్టారట.తాను ఇప్పుడు వెళ్లి పాటలు పాడకపోతే నాకు భవిష్యత్తు ఉండదని భావించినటువంటి మధుప్రియ తన భర్తను ఎదిరించి తనకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారని తెలుస్తుంది.