Mahalakshmi – Ravindar: రీసెంట్ గా పెళ్లయిన వీజే మహాలక్ష్మి , రవీందర్ ట్రెండింగ్ కపుల్ గా నడుస్తున్నారు. వీరి గురించి రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది. వీరిద్దరు రీసెంట్‌గా తిరుమలలో సెప్టెంబర్ 2022 లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
మహాలక్ష్మి, రవీందర్ ఇద్దరూ కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ పెళ్లిపై వేల విమర్శలు వచ్చినా.. ఇద్దరూ వాటిని తేలికగా తీసుకున్నారు. విమర్శలు చేసిన వారికి బలంగా బదులిస్తున్నారు.
మా పెళ్లి పై ఎవ్వరు ఎన్ని చెప్పుకున్న కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మాకు మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ముఖ్యం అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. అలాగే ఇటీవల ఈ కపుల్ హనీమూన్ కు ఇంగ్లాండ్ వెళ్లి వచ్చారు. రవీందర్ విషయానికొస్తే ఇతను ఒక స్టార్ నిర్మాత.
అతన్ని సీరియల్ నటి అయినా మహాలక్ష్మి పరిచయంతో ప్రేమలో పడేసింది. మహాలక్ష్మి కు ఇంతకుముందే ఒక పెళ్లి జరిగింది. అయితే అతనితో పలు వివాదాల కారణంగా విడాకులు తీసుకుంది. వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇదే విధంగా రవీందర్ కూడా తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు.
ఈ క్రమంలో వీరిద్దరూ రెండో వివాహాన్ని చేసుకున్నారు. ఈ ఇద్దరికి కూడా ఇది రెండో వివాహం కావడం విశేషం. అయితే వీళ్ళ పెళ్లి జరిగినప్పటి నుంచి వీళ్లపై ఎన్నో విమర్శలు వచ్చాయి. మహాలక్ష్మి, రవీందర్ ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని ఆమెను విమర్శలతో అందరూ ముంచెత్తారు.
రవీందర్ శరీరాకృతి కారణంగా ప్రతి ఒక్కరూ వీరీ ప్రేమను నమ్మలేదు. కేవలం డబ్బు కోసమే పేరు ప్రఖ్యాత కోసమే వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారని అందరూ భావించారు. కానీ ప్రతిసారి వీళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ ప్రేమను చాటుకుంటూ వస్తున్నారు.
వాళ్లపై వచ్చిన విమర్శలను ఖండిస్తూ వాళ్ల ప్రేమ అర్థం ఏంటో వివరిస్తూ వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు తమ ప్రేమను పంచుకుంటూ కనిపిస్తూ ఉంటారు. ఇక ఇటీవల దీపావళి సందర్భంగా.. ఈ లవ్లీ కపుల్ చేసిన సందడి కూడా మనకు తెలిసిందే.
అదే విధంగా ఇటీవల రవీందర్ తన భార్య కోసం కొన్ని లక్షల విలువ చేశారు కొత్త లగ్జరీ కారును తీసుకున్నాడు. అయితే దానికి సంబంధించిన వీడియోను కూడా అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియో కు పోస్ట్ చేస్తూ.. మనం జీవితాంతం ప్రేమించే వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం..
మనం ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని కూడా అలాగే ప్రేమిస్తే అది గొప్ప విశేషం.. కొత్త భార్య..కొత్త జీవితం.. కొత్త కారు.. ఈజీ డ్రైవింగ్ అండ్ క్రేజీ సాయంతో స్వచ్ఛమైన స్వర్గం లాంటి కారును మనం పొందగలమని కోరుకుంటున్నాను..’ అని రవీందర్ రాసుకొచ్చాడు.
Mahalakshmi – Ravindar: లగ్జరీ కార్ కొన్న మహాలక్ష్మి, రవీందర్..
ఈ జంట బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ MG కారుని కొనుగోలు చేశారు. రవీందర్ అలాగే మహాలక్ష్మి ఇప్పటికే ఆడి వంటి లగ్జరీ కార్ ఉంది. దాని చిత్రాన్ని ఇటీవల నటి మహాలక్ష్మి షేర్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.